చేతి పంపు నుంచి రక్తమాంసాలు..! హడలెత్తిపోయిన జనాలు

యూపీలోని హీమీర్‌పూర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. జరిగింది వింతే అయిన స్థానికులు మాత్రం భయంతో హడలెత్తిపోతున్నారు. హమీర్‌పూర్‌లోని జాఖోడీ గ్రామంలో ఓ చేతిపంపు బోరు నుంచి రక్తమాంసాలు దారాగా రావడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్న జాఖోడీ గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం బోరు వేయించింది. దానికి హ్యాండ్‌ పంపు బిగించింది. కొంతకాలం భాగానే ఉన్న చేతిపంపు నుంచి ఇటీవల నీటికి బదులుగా రక్తం, మాంసం, బొక్కలు […]

చేతి పంపు నుంచి రక్తమాంసాలు..! హడలెత్తిపోయిన జనాలు
Follow us

|

Updated on: Dec 11, 2019 | 4:05 PM

యూపీలోని హీమీర్‌పూర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. జరిగింది వింతే అయిన స్థానికులు మాత్రం భయంతో హడలెత్తిపోతున్నారు. హమీర్‌పూర్‌లోని జాఖోడీ గ్రామంలో ఓ చేతిపంపు బోరు నుంచి రక్తమాంసాలు దారాగా రావడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్న జాఖోడీ గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం బోరు వేయించింది. దానికి హ్యాండ్‌ పంపు బిగించింది.

కొంతకాలం భాగానే ఉన్న చేతిపంపు నుంచి ఇటీవల నీటికి బదులుగా రక్తం, మాంసం, బొక్కలు ముక్కలుగా వస్తున్నాయి. ఇది చూసి ఖంగుతిన్న స్థానికులు ఏదో జరుగుతోందని భయపడిపోతున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో అధికారులు స్పందించారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకునని సమస్యను తీర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హ్యాండ్ పంప్ లోపల ఏదైనా జీవి మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రజలు ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని సూచించారు. అటుగా ఎవరూ వెళ్లకుండా చేసి చేతి పంపును మూసివేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తిందని గ్రామస్తులు వాపోతున్నారు. నీటికోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని, మహిళలు, చిన్నపిల్లలు నీళ్ల కోసం కష్టాలు పడుతున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.