Bombay High Court : ట్రాంజెండర్స్ ఎన్నికల పోటీ పై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు ..

ట్రాంజెండర్స్ ఎన్నికల్లో పోటీచేయడం పై ముంబై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లు మహిళా విభాగం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Bombay High Court : ట్రాంజెండర్స్ ఎన్నికల పోటీ పై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు ..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 1:08 PM

Bombay High Court : ట్రాంజెండర్స్ ఎన్నికల్లో పోటీచేయడం పై ముంబై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లు మహిళా విభాగం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. దాంతో ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న ట్రాంజెండర్స్ కు లైన్ క్లియర్  అయ్యింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి మహిళా విభాగం కింద కొందరు ట్రాన్స్‌జెండర్లు పోటీకి దిగారు. అయితే, వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ట్రాన్స్‌జెండర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తాము ఏ వర్గం కిందకు వస్తామో నిర్ణయించుకునే హక్కు వారికి ఉందని స్పష్టం చేసింది కోర్టు. మహిళా విభాగం కింద వారు పోటీ చేసుకోవచ్చంటూ జస్టిస్ రవీంద్ర ఘుగే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్పింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Corona Virus: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్.. ట్విటర్ ద్వారా వెల్లడి..

‘కోవిషీల్డ్’ ట్రేడ్ మార్క్ మాదే ! సీరం సంస్థపై నాందేడ్ కంపెనీ కేసు, వ్యాక్సిన్ కి వాడరాదని అభ్యర్ధన