పాత గోడలకు కొత్త హంగులు.. అందంగా ముస్తాబుతున్న ముంబై మహానగరం.. సుందరీకరణ పనుల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జీ.సౌత్ వార్డ్ కార్యాలయం వోర్లి రోడ్డల సుందరీకరణకు మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది.

  • Balaraju Goud
  • Publish Date - 3:28 pm, Thu, 25 February 21
పాత గోడలకు కొత్త హంగులు.. అందంగా ముస్తాబుతున్న ముంబై మహానగరం.. సుందరీకరణ పనుల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు

Transgender community to beautify worli : దేశ ఆర్థిక రాజధాని ముంబై సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జీ.సౌత్ వార్డ్ కార్యాలయం వోర్లి రోడ్డల సుందరీకరణకు మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది.. నిర్మాణ ప్రదేశాలలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతంలో మెటల్ సాయంతో సుందరీకరణ పనులు జరగుతున్నాయి. ప‌లు చోట్ల ఉన్న గోడ‌ల‌పై అద్భుత‌మైన పెయింటింగ్‌ను వేయిస్తున్నారు. వ‌ర్లి సుంద‌రీక‌ర‌ణ‌ పనుల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు భాగ‌స్వామ్యం అవుతున్నారు. తమ వంతు సాయంగా వాల్ పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తున్నారు ట్రాన్స్‌జెండ‌ర్లు. 80 నుంచి 100 ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండ‌ర్లు వేసిన పెయింటింగ్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. బీఎంసీకి వారందిస్తున్న సహాయం మరువలేనిదని మున్సిపల్ అధికారులు తెలిపారు.

వోర్లిలో సుమారు 80-100 సైట్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బీఎంసీ ఈ ప్రాంతంలోని లోహపు పలకలతో గోడలను చిత్రించడం ప్రారంభించింది. పౌరసంఘం సుందరీకరణ పనిని స్వయంగా చేస్తోంది. వోర్లిలోని అనిబిసెంట్ రోడ్ వద్ద ఉన్న లవ్ గ్రోవ్ పంపింగ్ స్టేషన్ కాంపౌండ్ గోడ వద్ద పనిచేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ ట్రాన్స్‌జెండ‌ర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తాను స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు పెయింటింగ్ మామూలుగా వేసేదాన్ని. కానీ ఇప్పుడు పెయింటింగ్‌లో అద్భుత‌మైన నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాను. ఈ ప్రాజెక్టులో గ‌త నాలుగైదు సంవ‌త్సరాల నుంచి కీల‌కంగా ఉన్నాను. తాము వేసిన పెయింటింగ్స్‌కు ప్రజ‌ల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపింది. ముంబై మహానగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో తాము భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.


కాగా, బీఎంసీ ఈ ప్రాజెక్టును విస్తరించి, నగరం అంతటా గోడలను అందంగా తీర్చిదిద్దేందుకు ఫ్లాన్ చేస్తోంది. దీనిపై స్పందించి బీఎంసీ పీఆర్‌వో మేము ట్రాన్స్‌జెండ‌ర్ వర్గానికి చెందిన చిత్రకారులతో కలిసి పనిచేసే సంస్థను చేర్చుకున్నాము. సమాజానికి, ప్రత్యేకించి కళాకారుల కోసం ఏదైనా చేయవలసి ఉంటుందని మేము భావించామని, అందుకే వీరిని ఎంచుకుని ప్రోత్సహిస్తున్నామన్నారు.
Read Also…. పుష్కలంగా జీతాలందుకుంటూనే అధికారుల కమీషన్లు, లంచాల కక్కుర్తి, వైరల్‌ అవుతున్న మున్సిపాలిటీ అధికారుల ఆడియో టేపులు