కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. ఇవాళే ప్రమాణస్వీకారం

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో నాలుగోసారి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విశ్వాసపరీక్షలో నెగ్గకపోవడంతో బీజేడీ- కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే 2007లో నవంబర్ 12 నుంచి 19వరకు(7 రోజులు).. 2008 మే 30 నుంచి […]

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. ఇవాళే ప్రమాణస్వీకారం
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 11:11 AM

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో నాలుగోసారి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విశ్వాసపరీక్షలో నెగ్గకపోవడంతో బీజేడీ- కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే 2007లో నవంబర్ 12 నుంచి 19వరకు(7 రోజులు).. 2008 మే 30 నుంచి 2011 ఆగష్టు4వరకు(3సంవత్సరాల 66 రోజులు).. 2018 మే 17నుంచి మే 23వరకు(6 రోజులు) యడ్యూరప్ప సీఎంగా పనిచేశారు.