Rahul Gandhi: ‘అన్నలా ఆప్యాయంగా తలపై ముద్దుపెడితే ఇలా అంటారా’.. బీజేపీ నేతపై కాంగ్రెస్ ఫైర్

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ.. రాజస్థాన్ మహిళా ఎమ్మెల్యే దివ్య మదెర్నా తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టారు. ఈ ఫోటోను షేర్ చేసిన బీజేపీ నేత.. దానికి క్యాప్షన్ ఇవ్వమని తన అనుచరులను కోరారు.

Rahul Gandhi: 'అన్నలా ఆప్యాయంగా తలపై ముద్దుపెడితే ఇలా అంటారా'.. బీజేపీ నేతపై కాంగ్రెస్ ఫైర్
MLA Divya Mahipal Maderna - MP Rahul Gandhi
Follow us

|

Updated on: Nov 24, 2022 | 9:06 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌‌లో కొనసాగుతున్న రాహుల్ యాత్రలో.. రాజస్థాన్‌‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో మాట్లాడుతూ నడుస్తున్న క్రమంలో ఆయన.. ఎమ్మెల్యేను దగ్గరకు తీసుకుని తలపై ముద్దుపెట్టాడు. దీనిపై దుమారం చెలరేగింది. ఆమెను కించపరిచేలా బీజేపీ నేత అరుణ్ యాదవ్.. ట్వీట్ చేశారు. దీనికి బెస్ట్ క్యాప్షన్ చెప్పాలంటూ నెటిజన్లను అడిగారు. ఆయన ట్వీట్‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఆ ట్వీట్‌పై డైరెక్ట్ దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అంటూ ట్వీట్ చేశారు. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది. మీకు కూడా కూతురు, భార్య, తల్లి ఉంటుంది కదా.. అంటూ మండిపడ్డారామె. రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని మంచి మార్గాలను కనుగొనాలని.. వ్యక్తిత్వాన్ని కించపరిచడం ఆపాలంటూ విరుచుకుపడ్డారు. ఆమెకు మద్ధతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

పూనమ్ చేయి పట్టి నడిచినప్పుడు కూడా దుమారం…

తెలంగాణలో రాహుల్ యాత్ర సాగినప్పుడు కూడా ఇలాంటి దుమారమే చెలరేగింది.  రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోను బీజేపీ నేత ప్రీతి గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘ఆయన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు’ అంటూ  వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టారు. ఆమె పోస్ట్‌పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. చాలా మంది నెటిజన్లు సైతం ఆమె వ్యాఖ్యను ఖండిస్తూ పోస్టులు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే