టిక్ టాక్ స్టార్ కి ఇక వీడియోలే గతి ! అచ్చిరాని ఆదంపూర్

హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్ ఓటమి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ ఆమెను ఓడించారు. ఆయనకు 64 వేల ఓట్లు రాగా.. సోనాలీకి సుమారు 34 వేల ఓట్లు లభించాయి. ఇక దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ తరఫున పోటీ చేసిన రమేష్ కుమార్ 15 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. కుల్దీప్ బిష్ణోయ్ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా […]

టిక్ టాక్ స్టార్ కి ఇక వీడియోలే గతి ! అచ్చిరాని ఆదంపూర్
Follow us

|

Updated on: Oct 24, 2019 | 4:50 PM

హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్ ఓటమి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ ఆమెను ఓడించారు. ఆయనకు 64 వేల ఓట్లు రాగా.. సోనాలీకి సుమారు 34 వేల ఓట్లు లభించాయి. ఇక దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ తరఫున పోటీ చేసిన రమేష్ కుమార్ 15 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. కుల్దీప్ బిష్ణోయ్ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదంపూర్ ని సోనాలీ ఫోగత్.. యూపీలోని అమేథీ లోక్ సభ నియోజకవర్గంతో పోల్చి.. ఇక్కడ తన గెలుపు నల్లేరు మీద నడకని ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నియోజకవర్గంలో అభివృధ్ది లేదని ఆమె చేసిన విమర్శలను ఓటర్లు తిప్పికొట్టారు. అయితే తన హయాంలోనే ఇక్కడ కొత్తగా ఆసుపత్రులు, స్కూళ్ళు ఏర్పడ్డాయని బిష్ణోయ్ తన ప్రచారంలో ఈ అంశాలను హైలైట్ చేశారు. ఏమైనా హర్యానా అసెంబ్లీ హంగ్ దిశగా సాగుతున్నదని వార్తలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా ఇక్కడ బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా పాచికలు వేస్తోంది. దుష్యంత్ చౌతాలా ఆధ్వర్యంలోని జేజేపీ నేతలతో చర్చలు జరపడం ప్రారంభించింది. పైగా ఆ పార్టీకి సీఎం పదవి ఆఫర్ ని కూడా ఇవ్వడంతో ఈ రాష్టంలో రాజకీయాలు మెల్లగా మలుపు తిరుగుతున్నాయి.