శరద్ చక్రబంధంలో బిజెపి చిత్తు..అసలేం జరిగిందంటే?

మహారాష్ట్ర పరాభవం బిజెపి స్వయంక‌ృతాపరాధమా? లేక వేరొకరి ఉచ్చులో పడి కమల నాథులు ఖంగుతిన్నారా? బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ డౌటును రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. శివసేన మొండికేసినపుడు.. గవర్నర్ 30 గంటల సమయమిచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గుచూపకుండా వుండిపోయిన దేవేంద్ర ఫడ్నవీస్.. శుక్రవారం రాత్రి అంత సడన్‌గా ఎందుకు రెచ్చిపోయారు? అర్ధరాత్రి మంతనాలకు ప్రాధాన్యతనిచ్చి అత్తెసరు నెంబర్‌తో ప్రమాణ స్వీకారానికి ఎందుకు సిద్దపడ్డారు? ఇదంతా బిజెపి వ్యూహమేనా? […]

శరద్ చక్రబంధంలో బిజెపి చిత్తు..అసలేం జరిగిందంటే?
Follow us

|

Updated on: Nov 27, 2019 | 5:44 PM

మహారాష్ట్ర పరాభవం బిజెపి స్వయంక‌ృతాపరాధమా? లేక వేరొకరి ఉచ్చులో పడి కమల నాథులు ఖంగుతిన్నారా? బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ డౌటును రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. శివసేన మొండికేసినపుడు.. గవర్నర్ 30 గంటల సమయమిచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గుచూపకుండా వుండిపోయిన దేవేంద్ర ఫడ్నవీస్.. శుక్రవారం రాత్రి అంత సడన్‌గా ఎందుకు రెచ్చిపోయారు? అర్ధరాత్రి మంతనాలకు ప్రాధాన్యతనిచ్చి అత్తెసరు నెంబర్‌తో ప్రమాణ స్వీకారానికి ఎందుకు సిద్దపడ్డారు? ఇదంతా బిజెపి వ్యూహమేనా? లేక వేరొకరు పన్నిన వ్యూహంలో దేవేంద్రుడు చిక్కుకున్నారా?

అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి దాదాపు నెల రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఉత్కంఠ కొనసాగుతూనే వచ్చింది. శివసేనను దారిలోకి తెచ్చుకునే పనిని పక్కన పెట్టేసిన బిజెపి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఈక్రమంలో గవర్నర్ ద్వారా మంత్రాంగం నెరిపి, రాష్ట్రపతి పాలన విధించారు. ఇదంతా జరిగి వారం తిరక్కముందే బిజెపి ఎందుకు తొందరపడింది. తెల్లారితే ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమైన ఉద్ధవ్ థాక్రేకు బిజెపి షాకిచ్చినట్లు కనిపించింది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయగానే ఆగమేఘాల మీద మోదీ, అమిత్‌షా అభినందనలు తెలపడం చూస్తే వీరందరి వ్యూహమేదో వర్కౌట్ అవుతున్నట్లే కనిపించింది.

కానీ, రెండు రోజులు తిరక్కముందే పరిస్థితి తల్లకిందులైంది. కమలనాథుల వ్యూహం తిరగబడిందన్న కథనాలు మొదలయ్యాయి. మరి వ్యూహం కమలనాథులదా? అలాంటి వ్యూహమేదో వుంటే.. ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు కలిసి హడావిడి చేస్తుంటే బిజెపి నేతలు ఎందుకు మౌనంగా వున్నారు? పరిస్థితిని లోతుగా పరిశీలిస్తే.. శరద్ పవార్ ఆడిన నాటకం తాలూకా వివరాలు తెరమీదికి వస్తాయి. మరింత లోతుగా చూస్తే.. శరద్ పవార్ రాజకీయ చతురతతో బిజెపిని బొక్కబోర్లా పడేశారని అవగతమవుతుంది.

శరద్ పవార్ ఢిల్లీ పర్యటన.. సోనియాతో పెద్దగా పురోగతి లేని చర్చలు.. ఆ తర్వాత అనూహ్యంగా నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ… ఇదంతా చూస్తే.. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నట్లే కనిపించింది. బిజెపి అధినాయకత్వం కూడా శరద్ పవార్ ‌నడకను చూసి, నిజంగానే ఆయన బుట్టలో పడినట్లు కనిపించింది. ఇదే సమయంలో అజిత్ పవార్ ఏకంగా తన దగ్గరున్న ఎమ్మెల్యేల సంతకాల లేఖతో బిజెపిని సంప్రదించడంతో నిజంగానే ఎన్సీపీ వీలయితే గంపగుత్తగా.. లేకుంటే చీలిక వర్గమైన తమతో వస్తుందని నమ్మేశారు బిజెపి నేతలు. అందుకే అర్ధరాత్రి మంతనాలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

ఇదంతా బిజెపిని బ్లేమ్ చేయడంతోపాటు అనైతిక పొత్తులకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పాల్పడ్డాయన్న అభిప్రాయం ప్రజల్లో కలుగకుండా.. బిజెపినే అధికారం కోసం కక్కుర్తి పడినట్లు ప్రజలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపేందుకు శరద్ పవార్, సోనియా కలిసి ఆడిన రాజకీయ నాటకమని తాజాగా తెలుస్తోంది. ఈ వ్యూహంలో ఆ రెండు పార్టీలు దాదాపు సక్సెస్సయ్యాయి కూడా. నిజానికి ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపడం ద్వారా దేవేంద్ర ఫడ్నవీస్, బిజెపి నేతలు హుందాగా వ్యవహరించారన్న పాజిటివ్ టాక్ వినిపించింది శనివారం దాకా. ఆ తర్వాత శరద్ పవార్ డైరెక్షన్‌లో అజిత్ పవార్ ఆడిన జగన్నాటకంతో బిజెపి పరువు పోగొట్టుకోవడంతోపాటు.. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలకు మైలేజీ పెరిగినట్లయ్యింది.

అదే సమయంలో మూడో ప్రయోజనం కూడా ఈ కూటమికి కలుగ చేశారు శరద్ పవార్. ఒకవేళ బిజెపిని అలాగే వదిలేస్తే.. వారింకేదైనా వ్యూహం పన్నే అవకాశాలున్నాయని భావించిన శరద్ పవార్.. తన అన్న కుమారునితో కొత్త నాటకానికి తెరతీయించడం ద్వారా బిజెపి దృష్టిని మళ్ళించారు. అందుకే వేరే ఏ ప్రయత్నాలు చేయకుండా కేవలం అజిత్ పవార్‌ను నమ్ముకుని వుండిపోయారు దేవేంద్ర ఫడ్నవీస్.. ఇతర బిజెపి నేతలు.

జగన్నాటకం ఆడిన అజిత్ పవార్ బిజెపి నుంచి తాను పొందాల్సిన ప్రయోజనాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే పొందేశారు. ఆయనపై వున్న ఇరిగేషన్ స్కామ్‌కు సంబంధించిన 9 కేసులను ఎత్తేయించుకున్నారు. కేసుల నుంచి బయటపడిన తర్వాత నింపాదిగా రాజీనామా చేసేసిన అజిత్ పవార్ బుధవారం చాలా సింపుల్‌గా, అసలేమీ జరగలేదన్నట్లుగా ఎన్సీపీ నేతలతో కలిసిపోయారు. అసెంబ్లీలోకి ప్రవేశిస్తుండగా.. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే.. అజిత్ పవార్‌ని రిసీవ్ చేసుకున్న దృశ్యాలను చూస్తే వారిద్దరిది ముందే ఒక అవగాహన అన్న అనుమానం కలుగక మానదు. నాలుగురోజుల పాటు నాటకం నడిపిన అజిత్ పవార్ ఇలా వచ్చీ రాగానే ఎన్సీపీ ఎల్పీ లీడర్‌గా కంటిన్యూ అవుతారని ప్రకటించడం.. ఆయన కూడా అసలేమీ జరగనట్లే ఎన్సీపీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించడం చూస్తుంటే ఇదంతా శరద్ ఆడిన జగన్నాటకమేనని క్లియర్‌గా బోధపడుతుంది.

ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ వ్యూహానికి శరద్, సోనియా భేటీలోనే వ్యూహరచన జరిగినట్లు పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఇది బిజెపికి మరీ ముఖ్యంగా అమిత్‌షా-మోదీ ద్వయానికి తొలి అతిపెద్ద ఝలక్. మరి వారు ఊరకనే వుంటారా అన్నది వేచి చూడాల్సిన అవసరం వుంది. ఇదివరకే శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సులేలపై సిబిఐ కేసులున్నాయి. ఇకపై వాటి సంగతి చూసేందుకు కమల నాథులు ప్రయత్నించకుండా వుంటారా అన్నదే ఇపుడు ఆసక్తికరమైన ప్రశ్న. అయితే ఈ విషయంలో అమిత్‌షా బుధవారం చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. అజిత్ పవార్‌కు ఏ అవినీతి కేసులోను ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వలేదని షా కుండ బద్దలు కొట్టడం ద్వారా భవిష్యత్‌లో తాము ఓ ఆటడుకుంటామన్న సంకేతాలు ఆల్‌రెడీ ఇచ్చేవారు బిజెపి బాస్.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..