Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్వీస్ట్.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్‌..

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజా బీజేపీ కీలక ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎంగా..

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్వీస్ట్.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్‌..
Jp Nadda And Devendra Fadna
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:10 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే పేరును ప్రకటించి బీజేపీ అందరిని ఆశ్చర్యపరిచింది. 100కు పైగా స్థానాల్లో గెలుపొందిన బీజేపీయే ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటుందన్న ప్రచారం సాగింది. మరోసారి ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపించింది. ఈ ఊహాగానాలన్నింటినీ చెక్‌ పెడుతూ అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ. మహారాష్ట్ర ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే డిప్యూటీగా ఉంటారని గతంలో చర్చ జరిగింది. అయితే, గవర్నర్‌ను కలిసిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో షిండే ముఖ్యమంత్రి అవుతారని.. ప్రకటించారు.కేబినెట్‌ విస్తరణలో శివసేన-బీజేపీ సభ్యులు ప్రమాణం చేస్తారన్నారు ఫడ్నవీస్‌. తాను ప్రభుత్వం నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత షిండేతో కలిసి మీడియాతో మాట్లాడారు ఫడ్నవీస్‌. బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని.. ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు ఫడ్నవీస్‌. ప్రజా తీర్పునకు విరుద్ధంగా శివసేన తప్పుకుందన్నారు.

అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కావాలని దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ కేంద్ర నాయకత్వం కోరిందని వెల్లడించారు. జేపీ నడ్డా మాట్లాడుతూ .. ‘‘ ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. పెద్ద మనసుతో బయట నుంచి ప్రభుత్వానికి అండగా ఉంటానని చెప్పారు. షిండేకు బీజేపీ మద్దతు ఇస్తుంది. ఇది మా పార్టీ నాయకుడు..  కార్యకర్తల నిజాయితీని చూపిస్తుంది. మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఉండాలని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరాలని బీజేపీ కేంద్ర బృందం నిర్ణయించింది. ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టాలి. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.

జేపీ నడ్డా ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే.. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయన ట్వీట్ చేస్తూ, “బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ పెద్ద మనసును చాటుకున్నారు. మహారాష్ట్ర, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం మహారాష్ట్ర పట్ల ఆయనకున్న నిజమైన విధేయత,సేవకు సంకేతం. ఇందుకు ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.. అని ట్వీట్ చేశారు.

జాతీయ వార్తల కోసం