మా బలం పెరిగింది.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ

మహారాజకీయం రోజుకో తీరుగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆరునెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. తిరిగి ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ముందుకు వస్తే.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపింది. వాస్తవానికి బీజేపీ, శివసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సరిపడ సీట్లను గెలుచుకున్నాయి. అయితే సీఎం పదవి విషయంలో వచ్చిన విభేదాలతో […]

మా బలం పెరిగింది.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2019 | 12:33 AM

మహారాజకీయం రోజుకో తీరుగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆరునెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. తిరిగి ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ముందుకు వస్తే.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపింది. వాస్తవానికి బీజేపీ, శివసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సరిపడ సీట్లను గెలుచుకున్నాయి. అయితే సీఎం పదవి విషయంలో వచ్చిన విభేదాలతో బీజేపీ, శివసేనలు విడిపోయాయి. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 105 సీట్లతో రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో..తమ పార్టీ బలం 119కి చేరిందన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని.. బీజేపీ ప్రమేయం లేకుండా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అనేది అసాధ్యం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాజకీయ కదలికలను పరిశీలిస్తున్నామన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!