‘ నియంతలా మారుతున్న బీజేపీ ప్రభుత్వం ‘.. కమల్ హాసన్

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తున్న సినీ ప్రముఖుల్లో ‘ మక్కళ్ నీది మయ్యమ్ ‘ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా చేరారు. ఈ చట్టాన్ని తేవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం క్రమేపీ నియంతలా మారుతోందని ఆయన ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులు తాము చేస్తున్న ఆందోళనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఈ విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న ఆయనను లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో యూనివర్సిటీ గేటు బయటే […]

' నియంతలా మారుతున్న బీజేపీ ప్రభుత్వం '.. కమల్ హాసన్
Follow us

|

Updated on: Dec 18, 2019 | 6:43 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తున్న సినీ ప్రముఖుల్లో ‘ మక్కళ్ నీది మయ్యమ్ ‘ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా చేరారు. ఈ చట్టాన్ని తేవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం క్రమేపీ నియంతలా మారుతోందని ఆయన ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులు తాము చేస్తున్న ఆందోళనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఈ విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న ఆయనను లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో యూనివర్సిటీ గేటు బయటే మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. ఇది కేవలం విద్యకు సంబంధించినదే కాదని, దేశానికి కూడా సంబంధించినదని అన్నారు.

ఈ దేశాన్ని మించిన బిల్లు ఏదీ లేదని, ఈ చట్టం విద్యార్థులకు, ప్రజలకు మంచిది కాదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘ ఈ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు నన్ను అనుమతించలేదు. అయితే… .నేను చనిపోయేంతవరకు నన్ను విద్యార్థిగానే పిలుచుకుంటాను.. అందుకే విద్యార్థుల పక్షాన మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను ‘ అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తాను పార్టీని ఏర్పాటు చేసినా, చేయకున్నా తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని, పార్టీని స్థాపించాను గనుక.. ఇక్కడికి రావడం తన కర్తవ్యంగా భావించానని ఆయన చెప్పారు.

టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?