Hardik Patel: కమలాన్ని కాదన్నాడు.. ఇప్పుడు చేరాడు.. హార్ధిక్ పటేల్ చేరికతో బీజేపీలో నయాజోష్..

గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఎట్టకేలకు గురువారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో గందరగోళంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చారు.

Hardik Patel: కమలాన్ని కాదన్నాడు.. ఇప్పుడు చేరాడు.. హార్ధిక్ పటేల్ చేరికతో బీజేపీలో నయాజోష్..
Hardik Patel
Follow us

|

Updated on: Jun 03, 2022 | 9:28 PM

Gujarat Elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. దాదాపు ఏడాది కాలంగా బీజేపీపై నిప్పులు చెరిగిన పాటిదార్ నాయకుడు.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఎట్టకేలకు గురువారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో గందరగోళంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చారు. 2017 గుజరాత్ ఎన్నికలలో బీజేపీని ఓటమికి చేరువ చేసిన ముగ్గురు యువ నాయకుల్లో ఒకరైన హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీలో తనకు దక్కాల్సిన అర్హత దక్కలేదని.. ప్రచారాలు లేదా నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ పేర్కొన్నారు.

పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్.. OBC నాయకుడు అల్పేష్ ఠాకోర్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీలు కులాలతోపాటు యువతను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు బీజేపీ 99 స్థానాలకు తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. 182 సీట్ల రాష్ట్ర అసెంబ్లీలో 92 సాధారణ మెజారిటీ కంటే ఏడు మాత్రమే (99) బీజేపీకి ఎక్కువ వచ్చాయి. 1995లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తక్కువ సంఖ్య.

మూడు దశాబ్దాలలో స్వతంత్ర అభ్యర్థులుగా అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీల విజయాలతో సహా 78 స్థానాల్లో కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొదటగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన అల్పేష్ ఠాకూర్, ఇప్పుడు హార్దిక్ పటేల్ డిసెంబర్‌లో జరిగే ఎన్నికలలో టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో చేరకుండా ఆ పార్టీ మద్దతుతో గెలిచిన మేవానీ ఇప్పుడు కాంగ్రెస్‌తోనే జతకట్టారు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పై కేసులు.. 

2015 నుంచి.. పాటిదార్ (పటేల్) ఉద్యమాన్ని ప్రారంభించి.. యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం పోరాడిన కార్యకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన హార్దిక్.. ఆ పోరాట సమయంలో దేశద్రోహంతో సహా తనపై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయన్న విషయాన్ని గ్రహించాడు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పటేల్‌కు.. ఈ కేసుల్లో దేనిలోనైనా దోషిగా తేలితే అది అతని రాజకీయ కెరీర్‌కు అవరోధంగా మారుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్‌లో నెగ్గడం అలా ఉంచితే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలతో సతమతమవుతోంది. ఈ సమయంలో అతని రాజకీయ ఎదుగుదలని పరిశీలిస్తే వారితో చేరడమే ఏకైక ఎంపిక అని బీజేపీ కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు విశ్వనీయవర్గాలు తెలిపాయి.

బీజెపితో అతని చర్చలు దాదాపు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమయ్యాయి. పటేల్ ప్రతిపక్ష పార్టీకి అతి పిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసినప్పటికీ, కాంగ్రెస్‌లోని అసమ్మతిని బయటపెట్టి మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌పై ఆరోపణలు..

ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. కాంగ్రెస్ “క్లాస్ట్రోఫోబిక్” అని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో నా పరిస్థితి కొత్తగా పెళ్ళైన వరుడిలా ఉంది, అతను బలవంతంగా వేసెక్టమీ చేయించుకున్నాడు’’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ అమిత్ చావ్డా.. ఇప్పటికే రాజీనామా చేసినప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, వ్యూహాలు, ప్రచార ప్రణాళికల కోసం ఎవరూ అతన్ని సంప్రదించలేదన్న వాదనలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.

పటేల్ తరచుగా హోం మంత్రి అమిత్ షాను “జనరల్ డయ్యర్” అని పిలిచేవారు. తన పాటిదార్ ఆందోళన సమయంలో బిజెపి తనకు రూ.1,200 కోట్లు ఇచ్చిందని ఆరోపించాడు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడిన భాషలోనే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఇప్పుడు, ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ప్రత్యేకించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన “ఉక్కు సంకల్పం” కోసం.. కాంగ్రెస్‌ ‘‘గుజరాత్ వ్యతిరేక’’, ‘‘హిందూ వ్యతిరేక’’ ‘‘ ప్రజా వ్యతిరేక’’ పార్టీ అంటూ అభివర్ణించారు.

ఎక్కువ సీట్లపై బీజేపీ గురి.. 

2017 తర్వాత బలం పుంజుకున్న అధికార బీజేపీ 1985లో లాగా.. 182 సీట్లకు గాను 149 సీట్లు సాధించి కాంగ్రెస్‌ రికార్డును బద్దలు కొట్టాలనే పట్టుదలకు హార్దిక్ పటేల్ సహకారం లభించనుంది. ఒకటి, హార్దిక్‌కు చెందిన కద్వా పటేల్ ఉపకులం నుంచి భూపేంద్ర పటేల్‌ను పాటిదార్ ముఖ్యమంత్రిగా నియమించడానికి బీజేపీ గత సంవత్సరం మొత్తం విజయ్ రూపానీ క్యాబినెట్‌ను భర్తీ చేసింది.

2019 లోక్‌సభ ఎన్నికలలో గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలను భారీ మెజార్టీతో బీజేపీ గెలుచుకున్నప్పుడు హార్దిక్ మ్యాజిక్ బాగా క్షీణించింది. అత్యల్ప విజయవంతమైన మార్జిన్ 1.25 లక్షల ఓట్లు, అత్యధికంగా 7 లక్షలతో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. మొత్తం 31 జిల్లాల పంచాయతీలను బీజేపీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారింది.

గత సారి 2015లో పాటిదార్ ఆందోళన జరిగినప్పుడు ఈ 31 జిల్లా పంచాయతీలలో కాంగ్రెస్ 24 గెలుచుకుంది. హార్దిక్ ఆందోళన గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా ఆకట్టుకోగా.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి లాభం చేకూరింది.

దీని తర్వాత 2016 జులైలో సౌరాష్ట్ర ప్రాంతంలోని ఉనా పట్టణంలో జిగ్నేష్ మేవానీ దళిత ఆందోళన కూడా బీజేపీకి మైనస్‌గా మారింది. ఈ మధ్య, అల్పేష్ ఠాకూర్ ఈ కులాల కోటాను ప్రభావితం చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్న ఒక బలమైన OBC నాయకుడిగా ఎదిగారు. గుజరాత్‌లో తొలిసారిగా పటేళ్లు, దళితులు, ఓబీసీలు ఒకే స్వరంతో మాట్లాడుతూ బలమైన ఎన్నికల భాగస్వామ్యాన్ని రూపొందించారు.

ఇప్పుడు హార్దిక్ కూడా అల్పేష్ ఠాకూర్‌తో జతకట్టడంతో.. జిగ్నేష్ మేవానీ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలారు.

కాంగ్రెస్‌తోనే జిగ్నెష్ 

దళితులు, ముస్లింల మధ్య దూకుడుగా ప్రచారం చేయడంతో పాటు షెడ్యూల్డ్ కులాల ఓటర్లు ఏడు శాతం మాత్రమే ఉన్నందున జిగ్నేష్ మేవానీ బిజెపికి ఎన్నికలలో పెద్దగా నష్టం కలిగించలేకపోయారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన 13 సీట్లలో ఏడు 2017లో BJP గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేష్ మేవానీకి అవకాశం కల్పించడం కోసం కాంగ్రెస్ తన వడ్గాం స్థానాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మణిభాయ్ వాఘేలా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవలే బీజేపీలో చేరారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 6.90 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సీఆర్‌ పాటిల్‌ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత 2020 జూలై నుంచి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. త్వరలో, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి పార్టీని విడిచిపెట్టారు. వారందరూ తదుపరి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే హార్దిక్‌ పటేల్‌ తనకు అవసరం అయినంత మాత్రాన బీజేపీకి అవసరం లేదని వ్యాసకర్త Darshan Desai పేర్కొన్నారు. అయితే.. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం నష్టమే చేకూరుతుందని అభివర్ణించారు.

Link Source

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..