భారీ వర్షానికి కూలిన వంతెన

జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉదంపూర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షానికి కూలిన వంతెన
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 8:54 PM

జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉదంపూర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తాజాగా శనివారం నాడు కురిసిన భారీ వర్షాలకు ఏకంగా బిర్మా బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో జమ్ము-శ్రీనగర్‌ మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న అధికారులు వంతెనకు మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే వర్షం పడుతుండటంతో.. పనులకు అంతరాయం కలుగుతుంది.

ఇక వంతెన కూలిన సమయంలో కూడా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయితే ఘటన జరిగిన సమయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో వంతెన మరమ్మత్తులు చేయడంపై సందిగ్ధత నెలకొంది.