దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం.. మరిన్ని పక్షుల మ‌ృత్యువాత.. మహారాష్ట్రలో చనిపోయిన నెమళ్ల గుర్తింపు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ బర్డ్‌ఫ్లూ మూగ జీవాలను బలిగొంటుంది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అనే ఈ వైరస్ ఇప్పటి దాకా 9 రాష్ట్రాలకు పాకింది.

  • Balaraju Goud
  • Publish Date - 7:51 pm, Sat, 23 January 21
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం.. మరిన్ని పక్షుల మ‌ృత్యువాత.. మహారాష్ట్రలో చనిపోయిన నెమళ్ల గుర్తింపు

Bird flu in India :  ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి మనషులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరోవైపు, బర్డ్ ఫ్లూ పక్షుల ప్రాణాలను కబళిస్తోంది. ఇటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ బర్డ్‌ఫ్లూ మూగ జీవాలను బలిగొంటుంది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అనే ఈ వైరస్ ఇప్పటి దాకా 9 రాష్ట్రాలకు పాకింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల పౌల్ట్రీ కోళ్లకు బర్డఫ్లూ విస్తరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ , ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఈ జాబాతా చేరిపోయాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా, గుజరాత్‌లోని సోమనాథ్ జిల్లాలకు వైరసఖ్ పాకినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అటు, మహారాష్ట్రలో పలుచోట్ల బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్న తరుణంలోనే మరో ఐదు నెమళ్లు సహా ఆరు పక్షులు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలోని బీద్ జిల్లా లోనీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ప్రాంతం శిరూర్ కేసర్ తాలూకా బాలాఘాట్ పర్వత శ్రేణులను ఆనుకుని ఉంటుంది. కాగా శిరూర్‌కేసర్ తాలూకాలో ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు 21 కాకులు చనిపోయినట్టు గుర్తించామన్నారు. మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. అటు దేశ రాజధానిలో మృత్యువాతపడ్డ కోళ్లను పూడ్చి వేసినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also… ఆ మహిళను చూసి వైద్యులే నివ్వరపోతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు 31 సార్లు కరోనా పాజిటివ్.. ఇప్పుడామె ఎలా ఉందంటే..?