PM Narendra Modi: భారత్ అరుదైన రికార్డు.. ప్రధాని మోడీకి అభినందనలు తెలిపిన బిల్ గేట్స్..

వ్యాక్సినేషన్ ప్రక్రియ 200 కోట్ల మార్క్ అధిగమించడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. COVID-19 ప్రభావాన్ని తగ్గించేందుకు

PM Narendra Modi: భారత్ అరుదైన రికార్డు.. ప్రధాని మోడీకి అభినందనలు తెలిపిన బిల్ గేట్స్..
Bill Gates Pm Modi(File Photo)
Follow us

|

Updated on: Jul 20, 2022 | 6:58 PM

Bill Gates congratulates PM Modi: భారతదేశంలో కరోనా కట్టడికి మోడీ సర్కార్ ఎన్నో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. సామాన్యులకు చేరువ అయ్యేలా చేసింది. మోడీ ప్రభుత్వం కృషితో.. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఇటీవల 200 కోట్ల మార్క్ దాటి.. మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ 200 కోట్ల మార్క్ అధిగమించడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు. COVID-19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్ గేట్స్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. 200కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించి.. మరో మైలురాయి సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు అంటూ ట్విట్ చేశారు. కోవిడ్ 19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో కొనసాగుతున్న తమ నిరంతర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బుధవారం ట్వీట్ చేశారు.

ఆదివారం (జూలై 17) మధ్యాహ్నం 12.30 గంటల వరకు భారత్‌లో 2,00,00,92,900 డోస్‌లను విజయవంతంగా పంపిణీ చేసింది. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశం మళ్లీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.‘‘భారతదేశం మళ్లీ చరిత్ర సృష్టించింది.. 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్యను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. భారత్ టీకా డ్రైవ్‌ను సంఖ్యను వేగంతో.. అసమానంగా మార్చడానికి ఎందరో సహకరించారు. ఇది COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేసిందంటూ మోదీ ట్వీట్ చేశారు.

ప్రారంభించిన 18 నెలల్లోనే..

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతిపెద్ద COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన 18 నెలల్లోనే భారత్‌ 200 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ ఈ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ 2021 జనవరి 16న ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు టీకాలు వేశారు. ఆ తర్వాత మార్చి 1, 2021 నుంచి సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు పైబడిన వారికి) వాక్సిన్ ఇచ్చారు. అనంతరం 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 12 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.

మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. COVID-19 టీకా కవరేజీ మొత్తం 200.33 కోట్లకు పైగా నమోదైంది. కాగా.. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అరికట్టేందుకు కేంద్రం ఉచితంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేస్తోంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ దస్తక్ లాంటి కార్యక్రమాలతో కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశంలోని నలుమూలల పంపిణీ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..