బీహార్ ఎన్నికలు, రేపిస్టు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వని ఆర్జేడీ

బీహార్ ఎన్నికలకు గాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సోమవారం తొలి  దశ అభ్యర్థుల జబితాను విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్రంలోని 16 జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

బీహార్ ఎన్నికలు, రేపిస్టు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వని ఆర్జేడీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 05, 2020 | 3:22 PM

బీహార్ ఎన్నికలకు గాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సోమవారం తొలి  దశ అభ్యర్థుల జబితాను విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్రంలోని 16 జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈ పార్టీ టికెట్లను నిరాకరించి వారి భార్యలకు ఇవ్వడం విశేషం. రాజ్ వల్లభ్ యాదవ్ అనే ఎమ్మెల్యే 2016 లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆర్జేడీ నాయకత్వం ఇతని భార్య విభాదేవికి నవాడా అసెంబ్లీ నియోజకవర్గానికి గాను టికెట్ ఇచ్చింది. అరుణ్ యాదవ్ అనే మరో కీచక ఎమ్మెల్యే రేప్ ఆరోపణను ఎదుర్కొని ఏడాదిగా పరారీలో ఉన్నాడు. ఇతని భార్య కిరణ్ దేవికి సందేష్ అసెంబ్లీ సెగ్మెంట్ కి గాను పార్టీ టికెట్ కేటాయించింది.