Bihar Assembly: బీహార్ అసెంబ్లీలో తన్నులాట… పోలీసు రిక్రూట్‌మెంట్‌ సవరణ బిల్లుపై రగడ

ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసిన ఘటన బీహార్‌లో జరిగింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీ రగడ జరిగింది. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టారు.

Bihar Assembly: బీహార్ అసెంబ్లీలో తన్నులాట... పోలీసు రిక్రూట్‌మెంట్‌ సవరణ బిల్లుపై రగడ
Bihar Political High Voltag
Follow us

|

Updated on: Mar 23, 2021 | 10:02 PM

Bihar Political High Voltage Drama: ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసిన ఘటన బీహార్‌లో జరిగింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీ రగడ జరిగింది. విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ను ఘెరావ్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే రంగప్రవేశం చేసిన మార్షల్స్‌ , పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. మార్షల్స్‌ కొంతమంది ఎమ్మెల్యేలను చితకబాదారు.

మహిళా ఎమ్మెల్యేలను కూడా బయటకు తోసేశారు. స్పీకర్‌ విజయ్‌కుమార్‌సింగ్‌ను చాంబర్‌ నుంచి బయటకు రాకుండా విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమయ్యింది. స్పీకర్‌ చాంబర్‌ ముందు బైఠాయించిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. మార్షల్స్‌తో పరిస్థితి అదుపు రాకపోవడంతో పోలీసులు కూడా అసెంబ్లీ లోకి వెళ్లారు. పోలీసులకు , ఆర్జేడీ-కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి ఎమ్మెల్యేలకు మధ్య ఘర్షణ జరిగింది.

ఎమ్మెల్యేలన్న కనీస గౌరవం ఇవ్వకుండా బయటకు ఈడ్చిపారేశారు. ఈ గొడవలో అసెంబ్లీ ప్రధాన ద్వారం దగ్గర కొందరు ఎమ్మెల్యేలు స్పృపతప్పి పడిపోయారు. దీంతో అంబులెన్స్‌ల్లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. నితీష్‌ ప్రభుత్వం రౌడీయిజానికి ఇది పరాకాష్ట అని ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: విశాఖ కార్మిక సంఘాల ఆందోళనకు ప్రభుత్వ మద్దతు, 26న మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ – పేర్ని నాని