Bihar Political Crisis: NDA కూటమికి జేడీయు గుడ్‌బై.. నితీశ్‌ది విశ్వాస ఘాతుకమంటూ BJP ధ్వజం

సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. తనకు 160 మందికి పైగా ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న విషయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు నితీశ్ చెప్పారు.

Nitish Kumar
Follow us

|

Updated on: Aug 09, 2022 | 5:56 PM

Bihar Politics: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (జేడీయు చీఫ్).. మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆ మేరకు గవర్నర్ ఫగు చౌహాన్‌ను పాట్నాలోని రాజ్‌భవన్‌లో కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం లాలూ సతీమణి, బీహార్ మాజీ సీఎం రాబ్రీ దేవి నివాసంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో నితీశ్ భేటీ అయ్యారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వారు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే వారి మధ్య డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తేజస్వి యాదవ్‌కు హోం శాఖను ఇవ్వనున్నట్లు సమాచారం.

సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. తనకు 160 మందికి పైగా ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలన్న విషయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు నితీశ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

నితీశ్ కుమార్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపించింది. 2020 ఎన్నికల్లో బీజేపీ, జేడీయు ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసినట్లు బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినా.. పెద్ద మనస్సుతో నితీశ్ కుమార్‌ను సీఎం చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం బీహార్ ప్రజలు, బీజేపీని వంచించడమేనని ఆరోపించారు.

బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఎల్జేపీ (రాంవిలాస్ వర్గం) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్‌కు ఓ సిద్ధాంతమంటూ లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి జరిగే తదుపరి ఎన్నికల్లో జేడీయు కేవలం 0 స్థానాలకు పరిమితం అవుతుందన్నారు. మరోసారి బీహార్ ప్రజల తీర్పును నితీశ్ కుమార్ వమ్ము చేశారంటూ ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్‌కున్న విశ్వసనీయత జీరోకి పడిపోయిందంటూ ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన నేపథ్యంలో నితీశ్ కుమార్, మహాకూటమికి బేషరతు మద్ధతు ఇస్తున్నట్లు జితన్ రాం మాంజి నేతృత్వంలోని HAM ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!