Bihar Politics: బీహార్ లో వీడిన పొలిటికల్ టెన్షన్.. 8వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. ప్రధాని రేసులో లేనని క్లారిటీ..

ఉత్కంఠ రేపిన బీహార్ రాజకీయాలకు తెరపడుతూ..కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమితో జతకట్టి.. కొద్దిసేపటి క్రితం

Bihar Politics: బీహార్ లో వీడిన పొలిటికల్ టెన్షన్.. 8వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. ప్రధాని రేసులో లేనని క్లారిటీ..
Nitish
Follow us

|

Updated on: Aug 10, 2022 | 6:40 PM

Bihar Politics: ఉత్కంఠ రేపిన బీహార్ రాజకీయాలకు తెరపడుతూ..కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమితో జతకట్టి.. కొద్దిసేపటి క్రితం బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఫాగూ చౌహన్ నితీష్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి. మహా కూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని.. బీహార్ ప్రజల సేవలో అంకితమవుతానన్నారు.

రాజ్ భవన్ లో జరిగని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సతీమణి, తల్లి రబ్ఢీదేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. కాగా.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడి.. బీహార్ తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. నితీష్ నిర్ణయాన్ని లలూ ప్రసాద్ యాదవ్ సమర్థించారని ఆర్జేడీ పార్టీ నాయకులు వెల్లడించారు. బీజేపీ అధినాయకత్వంపై కొంతకాలంగా కోపంతో ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో దోస్తికి గుడ్ బై చెప్పి.. సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది సేపటికే మహాకూటమితో జట్టుకట్టి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదిపారు. మంగళవారం బీహార్ గవర్నర్ ఫాగూ చౌహన్ ను కలిసి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలముందని.. ఏడు పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో బుధవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ పదవి పగ్గాలు చేపట్టారు. ఆర్జేడీతో పొత్తులో భాగంగా ఆపార్టీ నేత తేజస్వి యాదవ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. దీంతో తేజస్వి యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ శాసనసభలో 80 మంది శాసనసభ్యుల బలమున్న ఆర్జేడీకే స్పీకర్ పదవి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో మిత్రపక్షమైన కాంగ్రెస్ కు నాలుగు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..