Bihar Politics: రసవత్తరంగా బిహార్ రాజకీయం.. ఇవాళ ఎమ్మెల్యేలతో సీఎం నితీశ్ భేటీ.. ఏం జరగనుంది..?

బీహర్ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. బీజేపీ- జేడీయూ బంధం బలహీనపడిందన్న వార్తన నేపథ్యంలో కాసేపట్లో పాట్నాలో బీహార్ సీఎం నీతిష్ కుమార్ నేతృత్వంలో జరగనున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో కటీప్ చెప్పి హస్తం తో దోస్తి చేస్తారా.. లేకుంటే బీజేపీ.. నీతిష్ కు షాకిచ్చి

Bihar Politics: రసవత్తరంగా బిహార్ రాజకీయం.. ఇవాళ ఎమ్మెల్యేలతో సీఎం నితీశ్ భేటీ.. ఏం జరగనుంది..?
Nitish Kumar
Follow us

|

Updated on: Aug 09, 2022 | 9:03 AM

Nitish Kumar: బిహార్ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. బీజేపీ- జేడీయూ బంధం బలహీనపడిందన్న వార్తన నేపథ్యంలో కాసేపట్లో పాట్నాలో బిహార్ సీఎం నీతిష్ కుమార్ నేతృత్వంలో జరగనున్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో కటీప్ చెప్పి హస్తం తో దోస్తి చేస్తారా.. లేకుంటే బీజేపీ.. నీతిష్ కు షాకిచ్చి మహారాష్ట్ర తరహా రాజకీయాలకు తెరలేపుతుందా అనే చర్చ నెలకొంది. బిహార్ సీఎం నీతిష్ కుమార్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన సాయంత్రం ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్ లో రాజకీయాలు గంటకో మలుపుతిరుగుతున్న క్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. నీతిష్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈనేపథ్యంలో కాసేపట్లో జరిగే సమావేశంలో నీతిష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

బిహార్ శాసనసభలో వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 122 మంది శాసనసభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీకి 77, జేడీయూకి 45 మంది శాసనసభ్యులతో కలిపి ఎన్డీయేకి 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి 80 మంది, కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలుండగా.. కమ్యూనిస్టు పార్టీలకు 16 మంది శాసనసభ్యుల బలం ఉంది. వీరిలో సీపీఐ(ఎంఎల్)కి 12 మంది, సీపీఐకి 2, సీపీఏం కు2 ఎమ్మెల్యేల బలం ఉంది. హిందుస్తానీ అవామ్ మోర్చకు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి ఒక ఎమ్మెల్యే ఉండగా.. స్వతంత్య్ర అభ్యర్థి మరొకరున్నారు.

గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి బిహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతిష్ కుమార్.. ఆర్జేడీపై అవినీతి ఆరోపణలతో కొంత కాలానికి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టారు. 2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేయగా.. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు 122 నియోజకవర్గాల్లో గెలుపొందారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందినప్పటికి, మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కమలం పార్టీ నీతిష్ కుమార్ కే సీఎం పదవి అప్పగించింది. ఈక్రమంలో గత కొంతకాలంగా బీజేపీ, జేడీయూ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈఏడాది జులైలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సన్నహాక సమావేశానికి బిహార్ సీఎం నీతిష్ కుమార్ హాజరుకాలేదు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బిహార్ సీఎం డుమ్మా కొట్టారు. పదవీకాలం ముగిసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విడ్కోలు కార్యక్రమానికి, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రమాణ స్వీకారకార్యక్రమానికి హాజరుకాలేదు. వీటితో పాటు బిహార్ బీజేపీ నాయకులతోనూ నీతిష్ కు సరిగ్గా పొసగడం లేదనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర తరహా రాజకీయాలకు బిహార్ లో తెరలేపడమో లేదా జేడీయూ, ఆర్జేడీల్లో చీలిక తీసుకొచ్చి తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చో బెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతుందని..నీతిష్ కుమార్ అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో జేడీయూ ప్రాభావ్యం తగ్గకుండా, నీతిష్ కుమార్ పట్టు కోల్పోకుండా ఉండేందుకు బిహార్ సీఎం కీలకనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తన మాటకు విలువ ఉంటుందనే ఆలోచనలో నీతిష్ ఉన్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.ఏది ఏమైనప్పటికి బిహార్ సీఎం నీతిష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆరాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది కొద్ది గంటల్లో తేలిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..