సుశాంత్ మాజీ మేనేజరు మృతి పైనా పోలీసుల దర్యాప్తు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మాజీ మేనేజరు దిశా శాలియన్ మృతిపై కూడా బీహార్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ముంబై లోని మలద్ లో గల తమ అపార్ట్ మెంట్ పై నుంచి దిశా సూసైడ్ చేసుకున్న అసంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య కేసుతో..

సుశాంత్ మాజీ మేనేజరు మృతి పైనా పోలీసుల దర్యాప్తు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మాజీ మేనేజరు దిశా శాలియన్ మృతిపై కూడా బీహార్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ముంబై లోని మలద్ లో గల తమ అపార్ట్ మెంట్ పై నుంచి దిశా సూసైడ్ చేసుకున్న అసంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య కేసుతో బాటు తాజాగా దిశా కేసును కూడా తాము ఇన్వెస్టిగేట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా దిశా ఫ్రెండ్ సిద్దార్థ్ పితానిని ప్రశ్నిస్తామని, కానీ  అతడిని కాంటాక్ట్ చేయడానికి తాము చేసిన యత్నాలు విఫలమయ్యాయని వారన్నారు.

ఇలా ఉండగా..  తన కుమారుడు సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి రూ. 15 కోట్లను అక్రమంగా తన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నదని. ఆ తరువాత అతడిని వేధిస్తూ వచ్చిందని సుశాంత్ తండ్రి ఖాన్ ఆరోపిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu