Viral: పెళ్లప్పుడే అనుమానం.. వధువు ఆ పరీక్ష చేయించుకోవాలని వరుడు డిమాండ్.. దెబ్బకు అంతా షాక్!

ఆ ఇద్దరికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వధూవరులకు అప్పగింతల సమయంలో గొడవ చెలరేగింది. అంతే! వరుడు వధువుపై అనుమానపడి..

Viral: పెళ్లప్పుడే అనుమానం.. వధువు ఆ పరీక్ష చేయించుకోవాలని వరుడు డిమాండ్.. దెబ్బకు అంతా షాక్!
Marriage
Ravi Kiran

|

Nov 21, 2022 | 12:44 PM

ఆ ఇద్దరికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వధూవరులకు అప్పగింతల సమయంలో గొడవ చెలరేగింది. అంతే! వరుడు వధువుపై అనుమానపడి కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో దెబ్బకు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బీహార్‌లో నవంబర్ 17వ తేదీన చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్‌లోని తూర్పు చంపారణ్ జిల్లా మోతిహరిలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అప్పగింతల సమయంలో వధూవరుల మధ్య చెలరేగిన ఓ గొడవ.. తారస్థాయికి చేరుకుంది. వరుడు ఏకంగా వధువుకు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వధూవరులకు నవంబర్ 16న వివాహం జరగ్గా.. మరుసటి రోజు అనగా నవంబర్ 17న అప్పగింతల సమయంలో వరుడు, వధువుకు మధ్య గొడవ జరిగింది. దీంతో వధువు తల్లిదండ్రులు.. తమ బిడ్డకు అత్తవారింట ఎలాంటి ఇబ్బంది రాదని లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. దీంతో కోపోద్రిక్తుడైన వరుడు.. వధువు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో వరుడి కుటుంబీకులను వధువు బంధువులు బంధించారు. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రెండు రోజుల తర్వాత విడిచిపెట్టారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu