Tejaswi Yadav: ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ.. ఈ డిప్యూటీ సీఎం ప్రేమ కథకు అందరూ ఫిదా అవ్వాల్సిందే..

బీహార్ మొత్తం ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ బయటకు వచ్చింది. ఇంతకీ ఏమనుకుంటున్నారా.. తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్ గురించి.. లాలూ యాదవ్ కుటుంబంలోకి రాజశ్రీ వచ్చినప్పటి నుంచి ఆకుటుంబానికి

Tejaswi Yadav: ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ.. ఈ డిప్యూటీ సీఎం ప్రేమ కథకు అందరూ ఫిదా అవ్వాల్సిందే..
Tejaswi
Follow us

|

Updated on: Aug 13, 2022 | 10:23 AM

Tejaswi Yadav: బీహార్ లో పొలిటికల్ టెన్షన్ కు తెరపడింది. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా.. నితీష్ కుమార్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాతే బీహార్ మొత్తం ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ బయటకు వచ్చింది. ఇంతకీ ఏమనుకుంటున్నారా.. తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్ గురించి.. లాలూ యాదవ్ కుటుంబంలోకి రాజశ్రీ వచ్చినప్పటి నుంచి ఆకుటుంబానికి అదృష్టం వరించిందంటూ ఒకటే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో తేజస్వి యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. తన భార్య రాజశ్రీకి సంబంధించి ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు తేజస్వి.. అంతేకాదు తనది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ తన లవ్ స్టోరీని చెప్పేశాడు. అదేంటో మీరు చదివేయండి..

తన భార్య రాజశ్రీ యాదవ్ అసలు పేరు రాచెల్ గాడిన్హ్ అని.. ఆమెది హర్యానాలోని రేవారి జిల్లా అని చెప్పారు. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్ అని చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందని.. ఆతరువాత పెళ్లి చేసుకోవాలని డిసైట్ అయినట్లు తేజస్వి తెలిపారు. తన లవ్ గురించి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి చెప్పానని.. తాను రాచెల్ తో డేటింగ్ చేస్తున్నానని.. తననే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాని మనస్సులో మాటను బయటపెట్టానని.. దానికి తన తండ్రి నో ప్రాబ్లమ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు తేజస్వి యాదవ్. అయితే రాచెల్ క్రిస్టయన్ కావడంతో పెళ్లి తర్వాత తాను హిందుత్వంలోకి మారి రాజశ్రీగా పేరు మార్చుకున్నట్లు తెలిపారు. ప్రేమకు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఓకే చెప్పడంతో అది అరెంజ్డ్ మ్యారేజ్ అయిందని తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరిని ఓపెన్ చేశారు తేజస్వి.

లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి దంపతులకు 9మంది సంతానం కాగా.. వారిలో ఇద్దరు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ అబ్బాయిలు కాగా.. మిగిలిన వారంతా అమ్మాయిలే. కుమారులిద్దరిలో తేజస్వి యాదవ్ చిన్నోడు. మొత్తం మీద తన ఫ్యామీలి డిటెయిల్స్ తో పాటు తన ప్రేమ కథాచిత్రాన్ని తేజస్వి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్