పోలీస్ అధికారి క్వారంటైన్ ని ఖండించిన బిహార్ సీఎం నితీష్ కుమార్

బాలీవుడ్  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని రాష్ట్ర (బీహార్) సీఎం నితీష్ కుమార్ ఖండించారు.

పోలీస్ అధికారి క్వారంటైన్ ని ఖండించిన బిహార్ సీఎం నితీష్ కుమార్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 03, 2020 | 12:45 PM

బాలీవుడ్  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని రాష్ట్ర (బీహార్) సీఎం నితీష్ కుమార్ ఖండించారు. మా రాష్ట్ర పోలీసులు తమ విధుల్లో భాగంగానే ముంబై వెళ్లారని, ఇందులో రాజకీయానికి తావు లేదని ఆయన అన్నారు. ముంబై అధికారుల చర్యపై తమ రాష్ట్ర డీజీపీ మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతారని నితీష్ కుమార్ అన్నారు ‘ఏది ఏమైనా ఇది తప్పు.. మా వాళ్ళు కేసు దర్యాప్తు కోసం వెళ్తే బలవంతంగా క్వారంటైన్ కి తరలిస్తారా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా-ముంబై అధికారుల చర్య సిగ్గుచేటని బిహార్ మంత్రి సంజయ్ ఝా ఆరోపించారు. దీనిపై మా రాష్ట్ర పోలీసులు ఏదో ఒక చర్య తీసుకుంటారని అన్నారు. అయితే తమ చర్యను ముంబై సిబ్బంది సమర్థించుకున్నారు. మీడియా దీన్ని ‘మిస్ రిప్రెజెంట్’ చేసిందని  భగ్గుమంటూనే…  వినయ్ తివారీ డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్ గా వచ్చారని, తమ రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఆయనను క్వారంటైన్ కి తరలించవలసిందేనని వారన్నారు. అయితే క్వారంటైన్ కాల పరిమితి నుంచి తనను మినహాయించాలని తివారీ.. తమ కార్పొరేషన్ అధికారులను కోరవచ్ఛునన్నారు.