బీహార్‌లో ఇండిగో మేనేజర్ హత్య ఘటన, మీడియాపై సీఎం నితీష్ ఆగ్రహం, పోలీసులకు మీరే సహకరించాలని సూచన

బీహార్ లో ఇండిగో మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ హత్యపై మీడియా అడిగిన  ప్రశ్నలకు సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు..

  • Umakanth Rao
  • Publish Date - 11:21 am, Sat, 16 January 21
బీహార్‌లో ఇండిగో మేనేజర్ హత్య ఘటన, మీడియాపై సీఎం నితీష్ ఆగ్రహం,   పోలీసులకు మీరే సహకరించాలని సూచన

బీహార్ లో ఇండిగో మేనేజర్ రూపేష్ కుమార్ సింగ్ హత్యపై మీడియా అడిగిన  ప్రశ్నలకు సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఇందుకు నిదర్శనం ఈ దారుణ హత్యేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మీడియా పేర్కొన్న సందర్భంలో ఆయన ఆగ్రహాన్ని పట్టలేకపోయారు. ఒక హత్య జరిగింది.ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.. అయితే ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలా అని నితీష్ ప్రశ్నించారు. మీ వద్ద క్లూ ఉంటే పోలీసులకు తెలిపి వారికి సహకరించండి అన్నారు. గతంలో 2005 కు ముందు ఈ రాష్ట్రంలో భార్యాభర్తలు (లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి) పాలన సాగించినప్పుడు నేరాలు, ఘోరాలు జరగలేదా అని కూడా ఆయన అన్నారు. రూపేష్ కుమార్ సింగ్ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, వారి ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక మర్డర్ జరిగిందంటే దానికి మోటివ్ అంటూ ఉంటుందని, ఈ కేసులో అన్ని విధాలుగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని ఆయన చెప్పారు.

ఇండిగో మేనేజర్ రూపేష్ కుమార్ ని బైక్ పై వచ్చిన దుండగులు ఆయన ఇంటివద్దే కాల్చి చంపిన సంగతి విదితమే.. సీఎం నితీష్ కుమార్ ఇంటికి కేవలం రెండు కి.మీ. దూరంలో ఉన్న రూపేష్ ఇంటివద్దే ఈ ఘటన జరగడం విశేషం.  సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి.