Bhupendra Patel: సామాన్య కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు.. భూపేంద్ర పటేల్ జైత్రయాత్ర ఇది..

ఆయన సైలెంట్‌ కిల్లర్‌.. హంగు ఆర్భాటాలు లేకుండా రాజకీయాలు చేయడంలో దిట్ట. అందుకే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ద్వయం ఏరికోరి భూపేంద్ర పటేల్‌ను గుజరాత్‌ సీఎం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనపై...

Bhupendra Patel: సామాన్య కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు.. భూపేంద్ర పటేల్ జైత్రయాత్ర ఇది..
Bhupendra Patel
Follow us

|

Updated on: Dec 08, 2022 | 8:25 PM

ఆయన సైలెంట్‌ కిల్లర్‌.. హంగు ఆర్భాటాలు లేకుండా రాజకీయాలు చేయడంలో దిట్ట. అందుకే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ద్వయం ఏరికోరి భూపేంద్ర పటేల్‌ను గుజరాత్‌ సీఎం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనపై పెట్టిన బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చారు భూపేంద్ర పటేల్‌. బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సీట్లను సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. భూపేంద్ర పటేల్‌కు మోడీ వీర విధేయుడని పేరుంది. అమిత్‌షా అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పటేల్‌ సామాజికి వర్గానికి చెందిన భూపేంద్రను సీఎం చేసి ఆ వర్గం ఓట్లు బీజేపీకే దక్కేలా హైకమాండ్‌ వ్యూహాన్ని అమలు చేసింది. భూపేంద్ర పటేల్‌ పూర్తి పేరు భూపేంద్ర రజనీకాంత్‌ భాయి పటేల్‌. ఆయన 1962 జులై 15న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌ లోని కడవ పటిదార్ కుటుంబంలో జన్మించారు. అహ్మదాబాద్‌ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 1982లో డిప్లొమా పూర్తి చేశారు.

2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌కు అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కింది. విజయ్‌ రూపానీ స్థానంలో సెప్టెంబర్‌లో ఆయన సీఎం పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆయన సీఎం పదవిని చేపట్టారు. 1999 నుంచి 2000 వరకు మేమ్‌ నగర్‌ నగర పాలిక అధ్యక్షుడిగా పని చేశారు భూపేంద్ర పటేల్‌. 2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ పనిచేశారు. 2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌లోని తల్తేజ్ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

పటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్, పటీదార్ సంస్థలు సర్దార్ ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్‌ల ట్రస్టీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2017 ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈనెల 12వ తేదీన గుజరాత్‌ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్‌ ప్రమాణం చేస్తారు. ప్రధాని మోద , అమిత్‌షా ఆయన ప్రమాణస్వీకారానికి హాజరవుతారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు భూపేంద్ర పటేల్‌. ప్రధాని మోడీకి ఆయన నమ్మిన బంటుగా పేరుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగారు భూపేంద్ర పటేల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం