Bhupendra Patel: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. 17వ సీఎం ప్రమాణస్వీకారం

Gujarat New CM Oath ceremony: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ సోమవారంనాడు ప్రమాణ స్వీకార చేశారు.

Bhupendra Patel: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. 17వ సీఎం ప్రమాణస్వీకారం
Bhupendra Patel
Follow us

|

Updated on: Sep 13, 2021 | 3:29 PM

Bhupendra Patel as Gujarat CM: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ సోమవారంనాడు ప్రమాణ స్వీకార చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్షుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పర్సోత్తమ్ రూపాల, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత శనివారంనాడు విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయడంతో కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఆదివారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శుక్షాకాంక్షలు తెలిపారు.

Read Also… Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరియూ సంచలన కామెంట్స్‌.