రేప్‌‌‌‌‌ను సమర్థించిన సావర్కర్‌‌కా ‘భారతరత్న ‘ ? మెహబూబా ముఫ్తీ

హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కు ‘ భారతరత్న ‘ పురస్కారాన్ని ప్రకటించాలన్న బీజేపీ డిమాండుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. తన ట్విటర్ లో ఆమె కమలం పార్టీ పై ధ్వజమెత్తారు. అత్యాచారాన్ని సమర్థించిన వ్యక్తికి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. గాంధీజీ వంటి గొప్ప వ్యక్తులను ఈ దేశం అగౌరవపరుస్తోందని, కానీ సావర్కర్ లాంటి వారిపట్ల ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయంటే ఈ […]

రేప్‌‌‌‌‌ను సమర్థించిన సావర్కర్‌‌కా  'భారతరత్న ' ? మెహబూబా ముఫ్తీ

హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కు ‘ భారతరత్న ‘ పురస్కారాన్ని ప్రకటించాలన్న బీజేపీ డిమాండుపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. తన ట్విటర్ లో ఆమె కమలం పార్టీ పై ధ్వజమెత్తారు. అత్యాచారాన్ని సమర్థించిన వ్యక్తికి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. గాంధీజీ వంటి గొప్ప వ్యక్తులను ఈ దేశం అగౌరవపరుస్తోందని, కానీ సావర్కర్ లాంటి వారిపట్ల ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడవుతున్నాయంటే ఈ వ్యవస్థ తన విలువలను నైతికంగా సంస్కరించుకోవలసిందేనని ఆమె పేర్కొన్నారు. ‘ ఒక రాజకీయ ఆయుధంగా రేప్ ను వినియోగించుకోవాలని ‘ సావర్కర్ నాడు తన పుస్తకంలో షాకింగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు భారత రత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నప్పుడు గాంధీజీ హంతకుడు నాథూరామ్ గాడ్సే కి కూడా ఇవ్వాలని ఎందుకు కోరడంలేదని కాంగ్రెస్, ఎంఐఎం వంటి విపక్షాలు సెటైర్ వేస్తున్నాయి. ఈ నెల 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర బీజేపీ.. తన మేనిఫెస్టోలో సావర్కర్ కు, 19 వ శతాబ్దపు జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రి భాయ్ ఫూలే లకు కూడా ఈ అవార్డును ఇవ్వాలన్న డిమాండును లేవనెత్తింది. సావర్కర్ కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలన్న వాదనపై అప్పుడే దుమారం రేగుతోంది.