కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం!

భారత్, చైనా సరిహద్దులో డ్రాగన్ సైనికులపై సింహంలా గర్జించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అరుదైన గౌరవం అందజేయనుంది. భారత వీరుడు సంతోష్ బాబుకు వామ్ సంస్థ...

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం!
Follow us

|

Updated on: Jun 23, 2020 | 11:23 AM

భారత్, చైనా సరిహద్దులో డ్రాగన్ సైనికులపై సింహంలా గర్జించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అరుదైన గౌరవం అందజేయనుంది. భారత వీరుడు సంతోష్ బాబుకు వామ్ సంస్థ ‘భారత టైగర్’ బిరుదును ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు వామ్ గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే సొంత ఖర్చులతో సంతోష్ బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా, లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత తెలంగాణలోని ఓ ముఖ్య ప్రాంతంలో భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించి, స్వర్ణపతకం రూపంలో ‘భారత టైగర్’ అనే బిరుదును సంతోష్ బాబు కుటుంబీకులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి అమరుడైన సంతోష్ బాబుకు భారత ప్రజల తరపున ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోనున్నట్లు చెప్పారు.

సంతోష్ బాబు కుటుంబ సభ్యులను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్ స్వయంగా సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కల్నల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున ప్రకటించిన ప్రకారమే పరిహారం అందజేశారు. సంతోష్ బాబు తల్లి పేరిట కోటి రూపాయల చెక్ అందజేసిన కేసీఆర్..సంతోష్ బాబు పిల్లల పేరిట రూ.4 కోట్ల చెక్ అందజేశారు. హైదరాబాద్ లో కేటాయించిన 700 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అందజేశారు. సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఆఫర్ పత్రాలను కూడా అందజేశారు. సంతోస్ బాబు కుటుంబానికి తమంతా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.