దారుణం.. 6కి.మీలకు రూ.9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌

కరోనా వేళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ వైపు ప్రజలు తల్లడిల్లుతుంటే.. మరోవైపు కొందరు అమానుషత్వాన్ని చూపుతున్నారు.

దారుణం.. 6కి.మీలకు రూ.9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 11:44 AM

కరోనా వేళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ వైపు ప్రజలు తల్లడిల్లుతుంటే.. మరోవైపు కొందరు అమానుషత్వాన్ని చూపుతున్నారు. తాజాగా ఓ అంబులెన్స్ డ్రైవర్‌ 6 కి.మీల కోసం రూ.9,200 డిమాండ్ చేశాడు. అయితే తాము అంత చెల్లించలేమంటూ బాధితుల తండ్రి చెప్పడంతో.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశాడు. ఆ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

కోల్‌కతాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చైల్డ్ హెల్త్‌(ICH)లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఓ ఇద్దరు మైనర్ బాలురికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు వారి తండ్రి అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అక్కడకు వచ్చిన ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.9,200 ఇస్తే గానీ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లనంటూ మొండికేశాడు. ఆ రెండు ఆసుపత్రుల మధ్య కేవలం 6కి.మీల దూరం మాత్రమే ఉండగా.. అందుకోసం ఆ డ్రైవర్‌ రూ.9,200 డిమాండ్ చేశాడని బాలుర తండ్రి తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర అంత చెల్లించే స్తోమత లేదని, తన కుమారులను రక్షించండి అంటూ ఎంత వేడుకున్నా ఆ డ్రైవర్ మనసు కరగలేదని ఆయన వెల్లడించాడు. అంతేకాకుండా తన చిన్న కుమారుడికి ఆక్సిజన్ పంప్‌ను తీసేయడంతో పాటు అంబులెన్స్‌లో నుంచి తన భార్యను బయటకు తీసేశాడని ఆరోపించారు. ఇక ఈ విషయం తెలిసిన ఐసీహెచ్‌ వైద్యులు ఎలాగోలా మధ్యవర్తిత్వం చేయడంతో.. రెండు వేలకు ఆ డ్రైవర్ ఒప్పుకున్నాడని ఆయన తెలిపాడు. ఈ విషయం తెలిసిన పలువురు అంబులెన్స్ డ్రైవర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఇద్దరు బాలురు కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Read This Story Also: కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. అందరికీ థ్యాంక్స్‌