నెట్టింట ట్రెండవుతోన్న ఉల్లి..పడి పడి నవ్వుకుంటున్న జనం

నెట్టింట ట్రెండవుతోన్న ఉల్లి..పడి పడి నవ్వుకుంటున్న జనం

ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిందికి దిగి రానంటున్నాయి. కేజీ ఆనియన్స్‌ వంద రూపాయలకు పైనే పలుకుతుండటంతో ఇక మేమేం చేయలేమన్నట్లు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. దీంతో బంగారం కంటే మిన్నగా మారాయి ఆనియన్స్‌. చివరికి గోల్డ్‌, నగదును పక్కన బెట్టి పొలాలపై ఉన్న ఉల్లి పంటను దోచుకెళ్తున్నారు దొంగలు. ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం ఉల్లి ధరలపై జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ హిలేరియస్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసి […]

Pardhasaradhi Peri

|

Dec 05, 2019 | 7:46 PM

ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిందికి దిగి రానంటున్నాయి. కేజీ ఆనియన్స్‌ వంద రూపాయలకు పైనే పలుకుతుండటంతో ఇక మేమేం చేయలేమన్నట్లు ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. దీంతో బంగారం కంటే మిన్నగా మారాయి ఆనియన్స్‌. చివరికి గోల్డ్‌, నగదును పక్కన బెట్టి పొలాలపై ఉన్న ఉల్లి పంటను దోచుకెళ్తున్నారు దొంగలు.

ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం ఉల్లి ధరలపై జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ హిలేరియస్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు జనాలు. ఓ అబ్బాయి అమ్మాయికి..రింగ్‌కు బదులు ఉల్లిపాయతో ప్రపోజ్‌ చేస్తున్నఫొటో..ఇండియన్‌ ఆనియన్‌ అమెరికన్‌ డాలర్‌ కంటే స్ట్రాంగ్‌ అంటూ ఓ పోస్ట్‌..అలాగే ఉల్లిపాయల దగ్గర ఓ పెద్ద తుపాకీ పట్టుకొని కాపాలాగా నిల్చున్న ఓ వ్యక్తి..తమలపాకుతో పాటు ఏదైనా పండును వాయనంగా ఇచ్చే మహిళలు..ఇప్పుడు పండుకు బదులు ఆనియన్‌ పెడుతున్నట్లు..ఇలా రకరకాల ఫొటోలు నెట్టింట్లో ట్రెండవుతున్నాయి. ఇక ఆటో ఎక్కిన ప్రయాణికుడు డబ్బులకు బదులు ఉల్లిపాయలిస్తున్న వీడియో..ఓ యువతి ఆనియన్స్‌ బ్యాగ్‌ పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే..ముగ్గురు కుర్రాళ్లు ఆమెవెంటబడి..భయంతో ఆమె కిందపడిపోగానే ఆ ఉల్లిపాయలను ఏరుకొని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పారిపోతున్నట్లు ఇలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పైపైకి ఎగబాకుతున్న ధరలను చూసి ఆందోళన చెందడం మానేసి..ఈ ఉల్లి జోకులను చూసి నవ్వుకోమంటున్నారు నెటిజన్లు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu