Arvind Kejriwal: సీబీఐ ఛార్జ్ షీట్ లో ఆ పేరే లేదు.. సోదాల్లో ఏమీ లభించలేదు.. మద్యం కుంభకోణంపై షాకింగ్ కామెంట్స్..

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తుండగా.. అందుకు తగ్గట్టుగానే బీజేపీ లీడర్స్...

Arvind Kejriwal: సీబీఐ ఛార్జ్ షీట్ లో ఆ పేరే లేదు.. సోదాల్లో ఏమీ లభించలేదు.. మద్యం కుంభకోణంపై షాకింగ్ కామెంట్స్..
Cm Arvind Kejriwal
Follow us

|

Updated on: Nov 26, 2022 | 6:40 AM

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆప్ నేతలు విమర్శిస్తుండగా.. అందుకు తగ్గట్టుగానే బీజేపీ లీడర్స్ సమాధానాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెస్పాండ్ అవ్వడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఢిల్లీలో మద్యం పాలసీ కుంభకోణం కేసు నకిలీదని అన్నారు. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తులోనూ సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. మనీశ్‌ సిసోడియా పేరు సీబీఐ ఛార్జిషీట్‌లో లేదన్న కేజ్రీవాల్.. సోదాల్లో ఏమీ బయటపడకపోవడం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 800 మంది అధికారులు నాలుగు నెలల దర్యాప్తులో గుర్తించిందేమీలేదని కేజ్రీవాల్ ఆక్షేపించారు.

విద్యా రంగంలో విప్లవం తీసుకురావడం ద్వారా దేశంలోని కోట్ల మంది పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనీశ్‌ ఆశించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పరువు తీసేందుకు కుట్రలు చేయడం దారుణం. మనీశ్‌ సిసోడియా పేరు సీబీఐ ఛార్జిషీట్‌లో లేదు. సోదాల్లో ఏమీ బయటపడలేదు. నాలుగు నెలల సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు.

– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే డిసెంబరు 1న జరగనున్న తొలి విడత పోలింగ్‌కు గతంతో పోల్చుకుంటే ఎక్కువ మంది అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నవారేనని ఓ నివేదికలో వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీలోనే నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య అత్యధికంగా ఉందని పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై గతంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నేరచరిత్ర కలిగిన వారిని ఏ పార్టీలూ అభ్యర్థులుగా ప్రకటించకూడదని సూచించింది. అయితే ఆ ఆదేశాలను ఏ రాజకీయ పార్టీ కూడా పాటించలేదు. కాగా.. గుజ‌రాత్‌లో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింద‌ని ఆప్ మండిపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..