Arvind Kejriwal: ఆ ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటన

వ‌చ్చే రెండెళ్లల్లో జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ..

  • Shaik Madarsaheb
  • Publish Date - 2:13 pm, Thu, 28 January 21
Arvind Kejriwal: ఆ ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటన
అరవింద్ కేజ్రీవాల్

Aam Aadmi Party: న్యూఢిల్లీ: వ‌చ్చే రెండెళ్లల్లో జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి తొమ్మిదేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా నిర్వహించిన జాతీయ సమావేశంలో కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లల్లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. జ‌న‌వ‌రి 26వ తేదీన ఢిల్లీలో హింస‌కు కారణమైన రైతుల‌ను అరెస్టు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 26న జ‌రిగిన సంఘ‌ట‌న దురదృష్టకరం.. దీనివెనుక ఎవరున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. రిప‌బ్లిక్ డే నాడు జ‌రిగిన ఆందోళ‌నల‌‌తో వ్యవసాయ చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆపలేమని పేర్కొన్నారు. రైతుల‌కు అంద‌రం క‌లిసి శాంతియుతంగా మద్దుతివ్వాల‌ని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also Read: