PM Modi: ఆ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం.. ప్రధాని మోడీ కృషితో ఈ నెలఖారుకల్లా పరిష్కారం దొరికే ఛాన్స్..

అరుణాచల్ ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు నాటికి (నవంబర్) అరుణాచల్ - అస్సాం రాష్ట్రాల సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

PM Modi: ఆ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం.. ప్రధాని మోడీ కృషితో ఈ నెలఖారుకల్లా పరిష్కారం దొరికే ఛాన్స్..
Modi
Follow us

|

Updated on: Nov 01, 2022 | 4:58 PM

అరుణాచల్ ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరు నాటికి (నవంబర్) అరుణాచల్ – అస్సాం రాష్ట్రాల సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉందని అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ పేర్కొన్నారు. అస్సాం సరిహద్దు రక్షణ – అభివృద్ధి మంత్రి అతుల్ బోరా నేతృత్వంలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులు సరిహద్దు వివాదానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎం పెమా ఖండూతోపాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం పెమా ఖండూ మీడియాతో మాట్లాడారు. చారిత్రక నంసాయి ప్రకటన తర్వాత.. సరిహద్దు వివాదంపై ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమావేశాలు జరిగాయని.. ఈ పరంపరలో ఈ సమావేశం చివరిదిగా పేర్కొనవచ్చని తెలిపారు.

“చివరి ఒప్పందం తర్వాత శాశ్వత పరిష్కారం కోసం నాకు, అస్సాం సీఎం డాక్టర్ హిమంత బిస్వా శర్మకు మధ్య మరో సమావేశం జరగనుంది. నవంబర్ నెలాఖరులోగా మా మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలం నిశ్చయించుకున్నాం” అని పెమా ఖండూ తెలిపారు. నంసాయ్ డిక్లరేషన్‌ను అనుసరించి అస్సాం – అరుణాచల్ ప్రదేశ్‌లకు చెందిన క్యాబినెట్ మంత్రి నేతృత్వంలో 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఖండూ చెప్పారు. ఈ కమిటీలు సంయుక్తంగా వివాదాస్పద ప్రాంతాలను సందర్శించి, ఇరుపక్షాల ప్రజల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించి తమ నివేదికలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాయి.

కమిటీల నివేదికలపై ఖండూ మాట్లాడుతూ.. “ఈరోజు మేము ఈ నివేదికలను లోతుగా చర్చించాము. అన్ని నివేదికలు సానుకూలంగా ఉన్నాయని, ఈ సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి రెండు రాష్ట్రాల కమిటీలు నిజాయితీగా, సంయుక్తంగా పనిచేసినందుకు నేను సంతోషిస్తున్నాను”అని ఆయన పేర్కొన్నారు. దృఢమైన రాజకీయ సంకల్పం ఉంటే దశాబ్దాలుగా ఏ సమస్య కూడా అపరిష్కృతంగా ఉండదని తెలిపారు. సరిహద్దు వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించడానికి రెండు పొరుగు రాష్ట్రాల మధ్య సాఫీగా సంభాషణ జరిగేలా ప్రోత్సహించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు పెమా ఖండూ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అరుణాచల్ ప్రదేశ్‌తో మాత్రమే కాకుండా అస్సాంతో సరిహద్దులు పంచుకునే ఇతర ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు రేఖను పరిష్కరించడానికి వ్యక్తిగతంగా ముందుకు వచ్చినందుకు డాక్టర్ హిమంత బిస్వా శర్మకు సీఎం ఖండూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. అసోం ప్రజల ప్రేమ – సహకారం ఎల్లప్పుడూ సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి.. ఉత్సాహంతో, స్ఫూర్తితో పనిచేయడానికి తనను ప్రేరేపిస్తుందని ఖండూ తెలిపారు. అసోం – అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రేమగల ప్రజల మధ్య శాంతి, సామరస్యం కోసం సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని తాము నిశ్చయించుకున్నామని.. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..