నవల తెచ్చిన తంటా.. శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ

దాదాపు 30 ఏళ్ళ క్రితం తను రాసిన ఓ నవలకు గాను కాంగ్రెస్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. తిరువనంతపురంలోని ఓ కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ ది గ్రేట్ ఇండియన్ నావెల్ ‘ పేరిట శశిథరూర్ 1989 లో ఓ బుక్ రాశారు. ఇందులో ఆయన చాలాచోట్ల ఆయన.. ఒక వర్గాన్ని కించపరుస్తూ, వారి ప్రతిష్టను దిగజార్చేలా రచన సాగించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ […]

నవల తెచ్చిన తంటా.. శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 22, 2019 | 2:09 PM

దాదాపు 30 ఏళ్ళ క్రితం తను రాసిన ఓ నవలకు గాను కాంగ్రెస్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. తిరువనంతపురంలోని ఓ కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘ ది గ్రేట్ ఇండియన్ నావెల్ ‘ పేరిట శశిథరూర్ 1989 లో ఓ బుక్ రాశారు. ఇందులో ఆయన చాలాచోట్ల ఆయన.. ఒక వర్గాన్ని కించపరుస్తూ, వారి ప్రతిష్టను దిగజార్చేలా రచన సాగించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా నాయర్ మహిళలను ఆయన చిన్నచూపు చూస్తూ ఈ బుక్ రాశారని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ కేసులో శనివారం తొలి విచారణ జరగనుండగా.. థరూర్ ఈ విచారణకు గైర్హాజరయ్యారు. అయితే కోర్టు జారీ చేసిన సమన్లలో శశిథరూర్ హాజరు కావాలని ఉంది తప్ప అందులో తేదీ లేదని ఆయన కార్యాలయం పేర్కొంది. అసలు ఈ తొలి విచారణకు సంబంధించి ఎలాంటి సమన్లు అందలేదని కూడా తెలిపింది. ఏమైనా.. అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. తాము తిరువనంతపురం చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని వివరించింది. .. భారత స్వాతంత్రోద్యమం సమయంలోను, బ్రిటీషర్ల నుంచి స్వేఛ్చ పొందిన 30 ఏళ్ళ తరువాత దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయంలోనూ ఈ నవల వివరంగా ప్రస్తావించింది. అయితే ఈ సందర్భాన్ని థరూర్.. మహాభారత ఇతిహాసాన్ని గుర్తుకు తెస్తూ పరోక్షంగా సెటైరిక్ రచన సాగించడం విశేషం.