Terrorist: నీ తల్లిదండ్రుల కోసం లొంగిపో..తీపి మాటల తూటాలతో ఉగ్రవాదిని లొంగదీసుకున్న ఆర్మీ మేజర్..వీడియో వైరల్!

Terrorist: మీరు వెబ్ సిరీస్ లు చూస్తుంటారా? అయితే, కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో మొదటి సీజన్ లో ఓ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది.

Terrorist: నీ తల్లిదండ్రుల కోసం లొంగిపో..తీపి మాటల తూటాలతో ఉగ్రవాదిని లొంగదీసుకున్న ఆర్మీ మేజర్..వీడియో వైరల్!
Terrorist Surrender
Follow us

|

Updated on: Jun 26, 2021 | 11:01 PM

Terrorist: మీరు వెబ్ సిరీస్ లు చూస్తుంటారా? అయితే, కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో మొదటి సీజన్ లో ఓ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. టెర్రరిస్ట్ ఒకరు ఒక గదిలో దాకుంటాడు తుపాకీతో.. ఆ సిరీస్ లో ప్రభుత్వ అధికారిగా ఉన్న మనోజ్ బాజ్పాయ్ వచ్చి ఆ టెర్రరిస్ట్ ను లొంగిపొమ్మని అడుగుతాడు. ఆ సమయంలో టెర్రరిస్ట్ కు చెప్పే మాటలు వింటే అది సినిమా అని కూడా మనం మర్చిపోతాం. ఇదిగో ఇంచుమించు అటువంటి సంఘటనే కాశ్మీర్ లో ప్రత్యక్షంగా జరిగింది. అంతా అలానే కాకపోయినా.. ఆ టెర్రరిస్ట్ ను లొంగిపొమ్మని చెబుతూ ఆఫీసర్ మాట్లాడిన మాటలు.. దానికోసం ఆయన చేసిన ప్రయత్నం సినిమాలోలా జరిగాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే.. కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఆపరేషన్ చేస్తున్న భద్రతా దళాలు శుక్రవారం లష్కర్ ఉగ్రవాదిని చంపారు. ఆపరేషన్ సమయంలో మరో ఉగ్రవాది లొంగిపోయాడు. అతని పేరు సాహిల్ రంజాన్ దార్. అతను కాశ్మీర్ నివాసి. ఇతనిని లొంగిపొమ్మని ఆర్మీ 34వ రాష్ట్రీయ రైఫిల్స్‌ లోని చౌదరిగండ్ సిఐబికి చెందిన మేజర్ శుక్లా చెబుతూ.. చెప్పిన మాటలు ఉన్నాయి ఆ వీడియోలో ఆయన మాటలకు మెత్తబడిన ఉగ్రవాది లొంగిపోయాడు. సాహిల్ ఎకె -56 రైఫిల్‌ను కూడా అప్పగించాడు.

మేజర్ శుక్లా ఏమని చెప్పారంటే.. ముందు ఆయన తనకు తాను పరిచయం చేసుకున్నారు. తరువాత సాహిల్ నా మాట విను. నేను నీకు చివరి హెచ్చరిక చేసున్నాను. నేను నిన్ను అభ్యర్ధిస్తున్నాను.. నీ దగ్గర ఉన్న ఆయుధాల్ని వదిలి చేతులు పైకెత్తి బయటకు రా. నువ్వు నీ కుటుంబాన్ని గుర్తు చేసుకో. నీకోసం బాధపడతున్న స్నేహితుల గురించి ఆలోచించు. నీ తల్లిదండ్రులు నీకోసం పడే బాధ అర్ధం చేసుకో. మీ కుటుంబం నాకు తెలుసు. వారంతా నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు లొంగిపోతే నీకు ఏ హానీ జరగదు. నువ్వు నా మాటలు వింటున్నావని నాకు తెలుసు. దయచేసి లొంగిపో సాహిల్. నీ ఆయుధం అప్పగించు. నీకు ఏమీ జరగకుండా నాదీ భరోసా. ఇలా మెత్తని మాటలు చెప్పేసరికి సాహిల్ లొంగిపోవడానికి అంగీకరించాడు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అవకాశం ఉండీ కూడా తీవ్రవాదిని చంపకుండా బ్రతిమాలి.. లొంగిపోయెలా మంచి మాటలు చెప్పిన మేజర్ శుక్లాను అందరూ అభినందిస్తున్నారు. ఆ వీడియో ఉన్న ట్వీట్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ చూడండి. కచ్చితంగా మేజర్ శుక్లాను మీరు అభినందించి తీరతారు. అదేవిధంగా కాశ్మీర్ లో పరిస్థితులపై.. మన ఆర్మీ చేస్తున్న సాహసాలపై మీకు మంచి అవగాహన వస్తుంది.

Also Read: Cops Apologise: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్‌లో చిక్కుకుని మహిళ మృతి.. క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసులు

పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా