ఆంటీ తెగువకు ఫిదా అయ్యా: ఆనంద్ మహీంద్రా ట్విట్..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లొకెక్కారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన స్టైల్‌లో అందరినీ ఆలోచింపజేసే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో కొత్త వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆంటీ తెగువకు ఫిదా అయ్యా: ఆనంద్ మహీంద్రా ట్విట్..
Jyothi Gadda

|

Mar 06, 2020 | 11:03 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లొకెక్కారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన స్టైల్‌లో అందరినీ ఆలోచింపజేసే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో కొత్త వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు..ఆ వీడియోలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ..కనిపించిన మహిళా టీచర్‌ని అభినందించారు. వివరాల్లోకి వెళితే…

పుణెలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై బైక్ నడుపుకుంటూ ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అయితే ఇది గమనించిన గోఖలే అనే ఉపాధ్యాయురాలు అతడిని అడ్డుకున్నది. ఇలా ఫుట్ పాత్ పై కాదు రోడ్లపై బైక్ నడపాలని అతడికి ఆమె సూచిందింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అలా వైరల్ అవుతూ ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఇది గమనించిన ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ ఆమెను అభినందిస్తూ కామెంట్ చేశారు. వీడియోను చూడగానే ఆమె తెగువకు ప్రశంసలు కురిపిస్తూ ఇలాంటివారి వల్లే ప్రపంచం సురక్షితంగా ఉందని పేర్కొంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలిని సత్కరించాలని, లేదా అంతర్జాతీయ ఆంటీల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని మహింద్రా కామెంట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వీడియోను చూడగానే నేను ఆంటీలకు అభిమానిని అయ్యానని పేర్కొన్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ తాజగా మరోమారు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu