మోదీ విదేశీ పర్యటనల ఖర్చులో సీక్రెట్.. అమిత్‌షా ఏం చెప్పారంటే?

దేశంలో అత్యున్నత పదవుల్లో వున్న వారు తరచూ విదేశీ పర్యటనలు చేయడం సహజం. ఎవరు అధికారంలో వున్నా సర్వసాధారణంగా జరిగేదే అది. కానీ, ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకైన ఖర్చులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మోదీ ఫారీన్ టూర్ల ఖర్చు సుమారు 255 కోట్ల రూపాయలు అయ్యిందని, మరే ప్రధాని ఇంతవరకు ఈ స్థాయిలో విదేశీ పర్యటనలకు వెళ్ళలేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు గోల చేస్తున్నారు. అదే సమయంలో బిజెపి అధ్యక్షుడు […]

మోదీ విదేశీ పర్యటనల ఖర్చులో సీక్రెట్.. అమిత్‌షా ఏం చెప్పారంటే?
Follow us

|

Updated on: Nov 28, 2019 | 12:40 PM

దేశంలో అత్యున్నత పదవుల్లో వున్న వారు తరచూ విదేశీ పర్యటనలు చేయడం సహజం. ఎవరు అధికారంలో వున్నా సర్వసాధారణంగా జరిగేదే అది. కానీ, ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకైన ఖర్చులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మోదీ ఫారీన్ టూర్ల ఖర్చు సుమారు 255 కోట్ల రూపాయలు అయ్యిందని, మరే ప్రధాని ఇంతవరకు ఈ స్థాయిలో విదేశీ పర్యటనలకు వెళ్ళలేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు గోల చేస్తున్నారు. అదే సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్లమెంటు వేదికగా మోదీ రహస్యాలను వెల్లడించేశారు.

నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించే దాకా బిజెపిలో ఫుల్‌టైమ్ వర్కర్. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన దేశం నలుమూలలా పర్యటించేవారు. ఆ సమయంలో ఎక్కువ పర్యటనలు రైలులోనే జరిపేవారు. అది కూడా లగ్జరీ బోగీల్లో కాకుండా సాధారణ స్థాయిలో స్లీపర్ లేదా 3వ తరగతి ఏసీల్లోనే ఎక్కువ పర్యటించేవారని బిజెపి వర్గాలు చెబుతుంటాయి. పూర్తి సమయ కార్యకర్తగా బిజెపి ఆఫీసుల్లోనే బస చేసేందుకు, పార్టీ నాయకుల ఇళ్ళలోనే భోంచేసేందుకు మోదీ మొగ్గుచూపే వారని బిజెపి నేతలు చెబుతుంటారు. ఈ క్రమంలో అమిత్‌షా వెల్లడించిన అంశాలు మోదీ లివింగ్ స్టైల్‌పై ఆసక్తి రేకెత్తించేవిగా వున్నాయి.

లోక్‌సభలో మాట్లాడిన అమిత్‌షా మోదీ ఫారిన్ టూర్లపై జరుగుతున్న రగడను సున్నితంగా తిప్పికొట్టారు. మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఏ ఇతర నాయకుల ఖర్చుల కన్నా చాలా తక్కువగా వుంటాయని వెల్లడించారు. విదేశీ పర్యటనల్లో అత్యంత సాదాసీదాగా మోదీ నడచుకుంటారని, విమానాశ్రాయాల్లోనే మోదీ స్నానాదులు ముగించి, ఫైవ్ స్టార్ హోటళ్ళ ఛార్జీలను సేవ్ చేస్తారని అమిత్ చెప్పుకొచ్చారు. విమానాలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయినా లేక ఆలస్యమైనా మోదీ విమానాశ్రాయాల్లోని లాబీల్లోనే వుండిపోతారని, అందరిలా ఫైవ్ స్టార్ హోటళ్ళకు వెళ్ళి ఖర్చులు పెంచేయరని చెప్పుకొచ్చారు హోం మంత్రి.

దానికితోడు.. మోదీ విదేశీ పర్యటనలకు తనతోపాటు తీసుకెళ్ళే సిబ్బందిని కూడా చాలా మటుకు తగ్గించేస్తారని, మిగితావారి కంటే 20 శాతం తక్కువగా సిబ్బందిని, అధికారులను వెంట తీసుకెళ్ళడం ద్వారా అనవసర వ్యయాన్ని తగ్గిస్తారని చెప్పారు. విదేశీ వ్యవహారాలకు పెద్ద పీట వేస్తున్న నరేంద్ర మోదీ కాస్త ఎక్కువ స్థాయిలో విదేశీ పర్యటనలు చేస్తుండొచ్చు గాక.. కానీ వ్యయంపై మాత్రం ఖచ్చితంగా నియంత్రణ పాటిస్తారని అమిత్ షా చెప్పుకొచ్చారు. అమిత్ షా ప్రకటన కొందరిలో మోదీ లైఫ్ స్టైల్‌పై ఆసక్తి రేపగా.. మరికొందరు మాత్రం ఎద్దేవా చేస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..