అమిత్‌షా వారసుడు అతనే.. త్వరలోనే పట్టాభిషేకం

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన వారసున్ని ఎంపిక చేసేశారా ? దీనికి బిజెపి సీనియర్లతోపాటు సంఘ్ పరివార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? జాతీయ రాజకీయాల్లో జరుతున్న చర్చ చూస్తే నిజమేననిపిస్తోంది. త్వరలోనే తన వారసుడికి బిజెపి అధ్యక్ష బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించి.. తాను పూర్తి స్థాయిలో హోం శాఖపై దృష్టి కేంద్రీకరిస్తారని ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తున్నా పేర్లు రెండే రెండు. ఒకటి ప్రధాన […]

అమిత్‌షా వారసుడు అతనే.. త్వరలోనే పట్టాభిషేకం
Follow us

|

Updated on: Dec 18, 2019 | 3:44 PM

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన వారసున్ని ఎంపిక చేసేశారా ? దీనికి బిజెపి సీనియర్లతోపాటు సంఘ్ పరివార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? జాతీయ రాజకీయాల్లో జరుతున్న చర్చ చూస్తే నిజమేననిపిస్తోంది. త్వరలోనే తన వారసుడికి బిజెపి అధ్యక్ష బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించి.. తాను పూర్తి స్థాయిలో హోం శాఖపై దృష్టి కేంద్రీకరిస్తారని ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

జాతీయ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తున్నా పేర్లు రెండే రెండు. ఒకటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరొకటి హోం శాఖా మంత్రి అమిత్‌షా. రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. కాగల కార్యాలన్నీ అమిత్‌షా చేతుల మీదుగా జరిపిస్తున్నారు. ముందుగా ట్రిపుల్ తలాక్ బిల్లుతో మొదలై.. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన, అయోధ్య రామ మందిర వివాద పరిష్కారం.. తాజాగా పౌరసత్వ చట్ట సవరణ ఇలా బిజెపి నాలుగు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న పనులను వరుసగా పూర్తి చేశారు అమిత్ షా.

ఈ నేపథ్యంలో యమా బిజీగా మారిపోయిన షా.. పూర్తిస్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారన్న కథనాలు వస్తున్నాయి. అందుకే వర్కింగ్ ప్రెసిడెంటుగా జెపి నడ్డాను నియమించారు. గత కొంత కాలంగా జెపి నడ్డా.. తనదైన శైలిలో పార్టీ పనులను చూసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మోదీ, షాల డైరెక్షన్‌ని ఫాలో అవుతున్నారు నడ్డా. కాగా.. బిజెపి అధ్యక్షునిగా రెండు దఫాలకు మించి ఒకే వ్యక్తి వుండడానికి వీలు లేదు. దాంతో త్వరలోనే బిజెపికి పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో బిజెపి కొత్త సారథిగా ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షునిగా వున్న జెపి నడ్డానే నియమించాలని బిజెపి సీనియర్లంతా మూకుమ్మడిగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి నెలలోనే బిజెపికి కొత్త అధ్యక్షునిగా జెపి నడ్డాను నియమించి.. ఆ తర్వాత పార్టీ విధానాలకు అనుగుణంగా మిగిలిన తంతును పూర్తి చేసేందుకు బిజెపి నేతలు సిద్దమవుతున్నారు.