బ్రేకింగ్..ఆస్పత్రి నుంచి అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్

కరోనా పాజిటివ్ కి గురై ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం ఆసుపత్రి నుంచి..

  • Updated On - 6:04 pm, Sun, 2 August 20 Edited By: Pardhasaradhi Peri
బ్రేకింగ్..ఆస్పత్రి నుంచి అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్

కరోనా పాజిటివ్ కి గురై ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనకు, తన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కి పాజిటివ్ వచ్చిందని అమితాబ్ గత జులై 11 న ప్రకటించారు. కాగా తన తండ్రి ఆరోగ్యాన్ని గురించి అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేస్తూ కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చిందని, ఇక ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని పేర్కొన్నారు.