Ambulance: రోగిని తీసుకెళ్తుండగా డీజిల్‌ అయిపోయి రోడ్డుపై నిలిచిపోయిన అంబులెన్స్‌.. తాడుతో ట్రాక్టర్‌కు కట్టి..

Ambulance: ప్రాణాలు కాపాడటంలో అంబులెన్స్‌లది కీలక పాత్ర. రోగులను సమయానికి ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలను రక్షిస్తాయి. మరి రోగులను ఆస్పజత్రులకు చేర్చే సమయంలో..

Ambulance: రోగిని తీసుకెళ్తుండగా డీజిల్‌ అయిపోయి రోడ్డుపై నిలిచిపోయిన అంబులెన్స్‌.. తాడుతో ట్రాక్టర్‌కు కట్టి..
Follow us

|

Updated on: Apr 04, 2022 | 5:22 AM

Ambulance: ప్రాణాలు కాపాడటంలో అంబులెన్స్‌లది కీలక పాత్ర. రోగులను సమయానికి ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలను రక్షిస్తాయి. మరి రోగులను ఆస్పజత్రులకు చేర్చే సమయంలో అంబులెన్స్‌లో డీజిల్ (Diesel) అయిపోయి మార్గమధ్యలో ఆగిపోతే రోగి పరిస్థితి ఏమిటి..? ప్రమాదాలు జరిగినా, ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చినా, అందుబాటులో ఉండి రక్షించేవి అంబులెన్స్‌లు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే వారికి ప్రతిక్షణం ఎంతో విలువైనది. అందుకే వారిని ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లకు అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు నిత్యం సిద్ధంగా ఉంటాయి. అందుకే అంబులెన్స్​లకు ట్రాఫిక్​రూల్స్​నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. కానీ రోగిని ఆసుపత్రికి తీసుకెళుతున్న అంబులెన్స్‌లో డీజిల్‌ అయిపోతే పరిస్థితి ఏంటనేది తలుచుకుంటేనే టెన్షన్‌గా ఉంది కదా.

ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రంలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ అంబులెన్స్​ నడిరోడ్డుపై నిలిచిపోయింది. రోగిని తీసుకుని ఓ అంబులెన్స్ బిజ్‌నూర్‌ నుంచి మీరట్‌కు బయలు దేరింది. మార్గం మధ్యలో అంబులెన్స్​లో ఇంధనం అయిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అటుగా వెళుతున్న ఓ స్థానికుడు దీన్ని గమనించాడు. వెంటనే అంబులెన్స్‌ను తాడు సాయంతో తన ట్రాక్టర్‌కు కట్టాడు. అలా అంబులెన్స్‌ను సమీప పెట్రోల్​బంక్​ వరకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. అంబులెన్స్​ నిర్వాహకుల నిర్లక్ష్యంపై సీరియస్‌ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇలా రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, డీజిల్‌ అయిపోయి రోడ్డుపై నిలిచిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Train Accident: నాసిక్‌లో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ దందాపై కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..!