ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం!

అసలే కరోనా కష్టకాలం...మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా పొదుపు మంత్రం పటిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే దిశగా పలు ప్రయత్నాలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది......

ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం!
Follow us

|

Updated on: Jul 15, 2020 | 9:15 PM

అసలే కరోనా కష్టకాలం…మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా పొదుపు మంత్రం పటిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే దిశగా పలు ప్రయత్నాలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేతనం లేకుండా ఉద్యోగుల దీర్ఘకాల సెలవు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ పథకం కింద ఉద్యోగులకు ఆరు నెలల నుంచీ రెండేళ్ల వరకూ ఈ సెలవులు ఉండే అవకాశం ఉంది. అవసరమైతే వీటిని 5 ఏళ్ల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం సంస్థ యజామాన్యమే ఉద్యోగులను ఎంపిక చేయనుంది. వయసు, ఆరోగ్యం, సామర్థ్యం, ప్రస్తుతం సంస్థకు ఉన్న అవసరాలు వంటి వాటి ఆధారంగా ఈ ఎంపిక జరగుతుంది. ఈ ప్రతిపాదనకు సంస్థ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. ఇక లవులపై వెళ్లే ఉద్యోగుల జాబితాను తయారు చేసే బాధ్యతను యాజమాన్యం రీజినల్ డైరెక్టర్లకు అప్పగించింది. ఆగస్టు 15 కల్లా తమ నివేదికలు సమర్పించాలని ఎయిర్‌ బోర్డు గడువు విధించినట్లు సమాచారం.