తిరుమల కొండపై అపచారం..!

తిరుమల కొండపై అపచారం జరిగింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కొండపై ఓ విమానం హల్‌చల్‌ చేసింది. ఆ ప్రదేశం నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉన్నప్పటికీ.. రెండు రోజులుగా ఓ విమానం అక్కడక్కడే చక్కర్లు కొడుతోంది. అది కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానమని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు […]

తిరుమల కొండపై అపచారం..!

తిరుమల కొండపై అపచారం జరిగింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కొండపై ఓ విమానం హల్‌చల్‌ చేసింది. ఆ ప్రదేశం నో ఫ్లైయింగ్‌ జోన్‌ కింద ఉన్నప్పటికీ.. రెండు రోజులుగా ఓ విమానం అక్కడక్కడే చక్కర్లు కొడుతోంది. అది కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానమని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది.

తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమని అందరూ నమ్ముతుంటారు. అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వలన.. విమానాలు తిరిగితే అవి పేలిపొయే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీష్ వారి హయాంలో ఇలా రెండు విమానాలు పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు కొండపై విమానాలు చక్కర్లు కొడుతుంటాయి. దీంతో వీటిపై గతంలోనూ టీటీడీ అధికారులు పలువురు ఏవియేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. కాగా దేశ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఐదేళ్లకోసారి విమానాల ద్వారా ఎస్‌వోఐ సర్వే చేయించే విషయం తెలిసిందే.

Published On - 11:27 am, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu