కాసేపట్లో మహారాష్ట్రలో రైతుల మహా సభ.. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో కదం తొక్కిన రైతులు

తొలుత పంజాబ్‌, హర్యానాలో పురుడుపోసుకున్న రైతుల ఉద్యమం ఢిల్లీ శివారుల్లో ఉధృతంగా సాగుతోంది. రైతుల ఉద్యమం ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా..

కాసేపట్లో మహారాష్ట్రలో రైతుల మహా సభ.. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో కదం తొక్కిన రైతులు
Follow us

|

Updated on: Jan 25, 2021 | 1:40 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీల‌తో పాటు ఉద్యోగ‌, కార్మిక సంఘాలు రైతుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆందోళ‌న‌లు నిర్వహిస్తున్నాయి.

తొలుత పంజాబ్‌, హర్యానాలో పురుడుపోసుకున్న రైతుల ఉద్యమం ఢిల్లీ శివారుల్లో ఉధృతంగా సాగుతోంది. రైతుల ఉద్యమం ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. నాసిక్‌ నుంచి ముంబై వరకు మహాపాదయాత్ర చేపట్టారు. వేలాదిమంది రైతులు కాలినడకన ముంబైకి బయలుదేరారు. రైతుల పాదయాత్ర మరికొన్ని గంటల్లో ముంబైకి చేరుకుంటుంది.

ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆధ్వర్యంలో రైతులు కదం తొక్కారు. నాసిక్‌ నుంచి ముంబై వరకు 180 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర నిర్వహించారు. కాసర్‌ఘాట్‌ పర్వత ప్రాంతం రోడ్లనీ రైతులతో నిండిపోయాయి. ముంబై లోని ఆజాద్‌మైదాన్‌లో రైతుల సభ జరుగనుంది. ఈ సభకు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌ హాజరవుతారు. రైతుల ఉద్యమానికి మహా వికాస్‌ ఆఘాడీ మద్దతు ప్రకటించింది.

రైతులను చర్చల పేరుతో కేంద్రం మోసం చేసిందని మహా వికాస్‌ ఆఘాడీ ఆరోపిస్తుంది. రైతు సంఘాలతో 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. చట్టాలను రద్దు చేసే వరకు రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మహా వికాస్‌ ఆఘాడీ నేతలు తెలిపారు.