Dr RS Sharma: ఆరోగ్య రంగంలో పెను మార్పులు జరగనున్నాయా.? డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏమిటి.? వివరాలివే

Dr RS Sharma: భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికి కోవిడ్‌ టీకా తీసుకున్న వారి సంఖ్య 110 కోట్లకు చేరుకుంది. టీకా తీసుకునేందుకు ముఖ్యంగా..

Dr RS Sharma: ఆరోగ్య రంగంలో పెను మార్పులు జరగనున్నాయా.? డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏమిటి.? వివరాలివే
Dr Rs Sharma
Follow us

|

Updated on: Nov 18, 2021 | 8:11 PM

Dr RS Sharma: భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికి కోవిడ్‌ టీకా తీసుకున్న వారి సంఖ్య 110 కోట్లకు చేరుకుంది. టీకా తీసుకునేందుకు ముఖ్యంగా కో-విన్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వెనుక ప్రధానంగా ఉన్న వ్యక్తి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ. ఈయన ఎన్‌హెచ్‌ఏ సీఈవోగా, టెక్నాలజీతో కూడాన హెల్త్‌ ఆర్కిటెక్చర్‌ను నిర్మిస్తున్నారు. కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ కింద పని చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో ఆర్‌ఎస్‌ శర్మ కీలక విషయాలు వెల్లడించారు.

1. ప్రశ్న: కో-విన్‌ యాప్‌తో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను స్వీకరించే ఇతర దేశాల స్థితి ఏమిటి..?

జవాబు: ఇతర దేశాలకు కూడా కో-విన్‌ యాప్‌ విస్తరించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. జూలై 5న జరిగిన వెబ్‌మినార్‌లో 140కిపైగా దేశాలు పాల్గొన్నాయి. ఇందులో యాప్‌ గురించి వెల్లడించారు.  ఈ యాప్‌ను కొనుగోలు చేసే విధంగా ఇతర దేశాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా చర్చలు జరుపుతోంది. దక్షిణ అమెరికాతో ఎంఓయూపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. అలాగే ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని అనేక దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి.

2. ప్రశ్న: థర్డ్‌ డోస్‌ గురించి చర్చ జరుగుతోంది.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..?

జవాబు: కోవిడ్‌ యాప్‌ వల్ల ఎంతో ఉపయోగం ఉంది.  ప్రతి ఒక్కరికి టీకా అందే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. టీకా విషయంలో ప్రజలకు సులభతరం చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.  ఇప్పుడు దేశంలో దాదాపు 90 శాతం వరకు టీకా నమోదు అయ్యే విధంగా యాప్‌లో 16 లేదా 17 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ కోవిన్‌ వల్ల వల్ల దేశంలో ఎంతో ప్రయోజనం ఉంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా సెకనుకు 1000 టీకాలు వేశాము.

3. ప్రశ్న: కోవిన్‌ యాప్‌లో భారీ మొత్తంలో డేటా పొందుపరుస్తున్నారు. డేటా గోప్యత విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?

జవాబు: ఈ విషయం ఎంతో ముఖ్యమైనది. డేటా విషయంలో ఆధార్‌ను ముఖ్యమైన డాక్యుమెంట్‌గా తీసుకున్నాము. యాప్‌ డిజైన్‌లలో డేటా గోప్యతపై అన్ని చర్యలు తీసుకున్నాము. ఈ డేటా గోప్యత విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల డేటా బయటపడకుండా ఈ యాప్ లో టెక్నాలజీని ఉపయోగించాము.

4. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తక్కువగా ఉన్న ప్రాంతాల డీఎంలతోప్రధాని ఇటీవల సమావేశం అయ్యారు. టీకా తీసుకునే వారి సంఖ్య పెంచేందుకు కోవిన్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుంది.?

జవాబు: ఈ విషయం కూడా ఎంతో ముఖ్యమైనది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రధాని మోడీ దృష్టి సారిస్తున్నారు. టీకా ప్రక్రియ తక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ శాతం పెరిగేలా చూడాలని సూచించారు. ఇందులో భాగంగా మోదీ హర్‌ ఘర్‌ దస్తక్‌ మిషన్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరు టీకా వేసుకునే విధంగా ఈ ప్రచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. వచ్చే సోమవారం నుంచి మా ప్లాట్‌ఫామ్‌ నుంచి కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాము. పూర్తిగా టీకా వేసుకున్న వారికి టీకా బ్యాడ్జ్‌ని అందుబాటులో ఉంచాము. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

5. ప్రశ్న: ఇ-సంజీవని యాప్‌ వల్ల ఉపయోగం ఉందా..? దీని నుంచి ఎలాంటి స్పందన వస్తోంది..?

జవాబు: ఇ-సంజీవని, ఆస్పత్రులు రెండు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇ-సంజీవని యాప్‌లో టెలిమెడిసిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే ఇందులో పేషెంట్‌కు సంబంధించిన మెడిసిన్‌ గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వైద్యుల నుంచి సలహాలు, సూచనలు పొందవచ్చు. అలాగే ఇ- ఆస్పత్రుల యాప్‌ నుంచి కూడా సమాచారం పొందవచ్చు. ఈ యాప్‌లో దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు, మెడిసిన్‌, వైద్యం, బ్లడ్‌ లభ్యత గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రెండు యాప్‌ల ద్వారా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ ఇదే యాప్‌లను మేము ఉపయోగించాలని చెప్పడం లేదు. ఇలాంటి యాప్‌లు సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఎన్నో యాప్స ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అందులో మీకు ఏది బాగుంటే అది మీరు వాడుకోవచ్చని సూచిస్తున్నాము.

6.ప్రశ్న: డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా ఆరోగ్య రంగంలో యూపీఐని రూపొందించేందుకు మీ ప్రణాళికలు ఏమిటి..?

జవాబు: యూపీఐ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నేను చెప్పలేను. ఇందుకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కొనసాగుతోంది. ఆరోగ్య రంగంలో క్లినిక్స్‌, ఫార్మసీలు, రోగ నిర్ధారణ నిపుణులు, ల్యాబ్స్‌, పెద్ద ఆస్పత్రులు ఇలా వేలాది మంది వాటాదారులు ఎందరో ఉన్నారు. యూపీఐని రూపొందించాలంటే వీళ్లందరిని కూడా ఒకే వేదికపైకి తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా అందరిని ఒకటి చేయడానికి మరింత సమయం పడుతుంది. ఇందులో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.

7. ప్రశ్న: డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో ప్రైవేటు సెక్టర్‌ పాత్ర ఎంత వరకు ఉంది..?

జవాబు: డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభించడంలో ప్రైవేటు రంగం నుంచి మాకు సానుకూలమైన స్పందన లభించింది. ఆస్పత్రులు, ఇ-ఫార్మసిస్‌, ఇతరాత్ర మెడికల్‌ విభాగాలతో తాము ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాము. వారందరూ కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన ఓ వర్క్‌ షాపులో వారితో మేము చర్చించడం జరిగింది. స్టార్టప్‌ కంపెనీలలో స్టాక్‌ హోల్డర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు పెద్ద వ్యవస్థను రూపొంచాల్సి వస్తుంది.

8. ప్రశ్న: ఆస్పత్రులు, బీమా సంస్థలను లింక్‌ చేయడానికి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ఓ పరిష్కారం చూపిస్తుంది..?

జవాబు: మేము ఇప్పటికే ఇ-గ్రీవెన్స్‌ రూపొందించాము. ఇది నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో ఒక భాగం. ప్రతిపాదిక డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాలు (ఆయూష్మాన్‌ పథకంతోపాటు) సామాన్యుల సమస్యలను పరిష్కరిస్తాయని నేను భావిస్తున్నా.

ఇవి కూడా చదవండి:

Kartarpur Sahib Corridor: నేటినుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభం.. కోవిడ్ ప్రొటోకాల్స్‌తో పవిత్ర దర్శనం..

Coronavirus: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా ఉధృతి.. అటు యూరప్‌లో ఇటు కేరళలో ఒకే విధంగా..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు