అనురాగ్ కశ్యప్ అరెస్టులో జాప్యం, బాధితురాలి ఆగ్రహం

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్  తనపై అత్యాచారం చేశాడంటూ ఆయనపై ముంబైలోని వెర్సోవా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నటి, బాధితురాలు ఈ కేసులో పోలీసులు కావాలనే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని..

అనురాగ్ కశ్యప్ అరెస్టులో జాప్యం, బాధితురాలి ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 4:51 PM

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్  తనపై అత్యాచారం చేశాడంటూ ఆయనపై ముంబైలోని వెర్సోవా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నటి, బాధితురాలు ఈ కేసులో పోలీసులు కావాలనే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తోంది. తాను కంప్లెయింట్ ఇఛ్చి ఇన్ని రోజులైనా కశ్యప్ ను ఒక్కసారి కూడా పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించలేదని, అరెస్టు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ తనను మాత్రం పోలీసులు రోజూ పిలిపించి గంటల తరబడి పోలీసు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారని ఆమె తెలిపింది. కశ్యప్ మీద ఎఫ్ ఐ ఆర్ అయితే దాఖలు చేశారు గానీ కేసు ఇన్వెస్టిగేషన్ అసలు మొదలే పెట్టలేదని బాధితురాలి తరఫు లాయర్ ఆరోపించారు. అనురాగ్ కశ్యప్ తన ఇంట్లో జాలీగా, హాయిగా గడుపుతుంటే తన క్లయింట్ మాత్రం నిత్యం వెర్సోవా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కవలసి వస్తోందని ఆ లాయర్ అన్నారు. వెంటనే అనురాగ్ కశ్యప్ ని అరెస్టు చేసి తన క్లయింటుకు న్యాయం చేయాలని బాధితురాలి తరఫు అడ్వొకేట్ కోరుతున్నారు.