భీమా కోరేగావ్‌ కేసులో 83 ఏళ్ల స్టాన్‌స్వామి అరెస్ట్‌!

ఆదివాసీ హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఫాదర్‌ స్టాన్‌ స్వామిని ఎన్‌ఐఏ అధికారులు రాంచీలో అరెస్ట్‌ చేశారు.. 83 ఏళ్ల ఈ సామాజికవేత్తను దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నారు..

భీమా కోరేగావ్‌ కేసులో 83 ఏళ్ల స్టాన్‌స్వామి అరెస్ట్‌!
Follow us

|

Updated on: Oct 09, 2020 | 1:03 PM

ఆదివాసీ హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఫాదర్‌ స్టాన్‌ స్వామిని ఎన్‌ఐఏ అధికారులు రాంచీలో అరెస్ట్‌ చేశారు.. 83 ఏళ్ల ఈ సామాజికవేత్తను దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ కేసులో అదుపులోకి తీసుకున్నారు.. ఆపై ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.. భీమా కోరేగావ్‌ అల్లర్లలో ఈయనకు ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రోనా విల్సన్‌, అరుణ్‌ ఫెరారియతో స్టాన్‌ స్వామికి సంబంధాలు ఉన్నాయన్నది ఎన్‌ఐఎ అధికారుల ఆరోపణ.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. రాంచీలో 20 నిమిషాల పాటు స్టాన్‌స్వామితో ఉన్న ఎన్‌ఐఏ పోలీసులు ఆ తర్వాత ఆయనను తమ వెంట తీసుకెళ్లారు.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు స్టాన్‌స్వామిని విచారించారు. అయితే ఎలాంటి వారెంట్‌ లేకుండా స్టాన్‌ స్వామిని అరెస్ట్‌ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కేసులోనే వరవరరావు, సుధా భరద్వాజ్‌ వంటి సామాజిక కార్యకర్తలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 28న వరవరరావు, సుధా భరద్వాజ్‌ ఇళ్లపై సోదాలు జరిగిన రోజే స్టాన్‌స్వామి ఇంటిపై కూడా సోదాలు జరిగాయి..