‘ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి’.. కేంద్ర హోం శాఖ

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సహా ప్రజలందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది ముఖ్యమని పేర్కొంది. దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది.

'ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి'.. కేంద్ర హోం శాఖ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2020 | 1:07 PM

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సహా ప్రజలందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది ముఖ్యమని పేర్కొంది. దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది. ఈ యాప్ ని ప్రభుత్వం ఏప్రిల్ వారారంభంలో ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని, ఇందుకు అధికారులు కూడా వారికి సహకరించాలని సూచించిన హోం శాఖ.. ఇప్పటికే ఈ యాప్ ని వాడుతున్న వారి సంఖ్య దేశంలో ఏడున్నర కోట్లకు పైగా ఉన్నట్టు వెల్లడించింది. వైరస్ లక్షణాలను, హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ సంస్థలను ప్రభుత్వం అభినందించింది.