Arvind Kejriwal: కేజ్రీవాల్ నెక్స్ట్‌ టార్గెట్ అదేనా..? ఢిల్లీ మున్సిపల్ కైవసంతో ఫుల్‌ జోష్‌లో ఆప్‌..

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో.. 134 స్థానాల్లో ఆప్‌ కైవసం చేసుకోగా.. బీజేపీ 104, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలిచింది. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు విజయం సాధించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ నెక్స్ట్‌ టార్గెట్ అదేనా..? ఢిల్లీ మున్సిపల్ కైవసంతో ఫుల్‌ జోష్‌లో ఆప్‌..
Arvind Kejriwal
Follow us

|

Updated on: Dec 07, 2022 | 6:38 PM

ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో (ఎంసీడీ) దాదాపు 15 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది.. రాష్ట్రంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇప్పటివరకు స్థానికంగా ఉన్న బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతూ వచ్చింది.. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్‌.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి మరి ఘన విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌.. తిరుగులేని విజయం సాధించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో.. 134 స్థానాల్లో ఆప్‌ కైవసం చేసుకోగా.. బీజేపీ 104, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలిచింది. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు విజయం సాధించారు. ఢిల్లీ, పంజాబ్‌ ప్రభుత్వాలను సొంతం చేసుకుని.. ఇప్పటికే జోరుమీదున్న ఆప్‌ పార్టీకి ఇది తిరుగులేని ఫలితంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 15 ఏళ్ల పాటు ఎంసీడీని నిరంతరం పాలించిన బీజేపీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు దక్కింది. అయితే, ఎంసీడీ ఎన్నికలు కేజ్రీవాల్‌ పార్టీకి తిరుగులేని శక్తిగా మార్చే అవకాశం ఉందాం..? ఈ గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. వచ్చే ఎన్నికలలో ఎలాంటి స్ట్రాటేజీని ఉపయోగించబోతుంది.. 2024 ఎన్నికల ముందు ఈ విజయం ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని.. లిక్కర్‌ స్కాం, రోడ్‌ స్కాం ఇలా పలు అంశాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకున్నా.. ఎందుకు ఓటమిపాలైంది.. అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. 2023లో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఢిల్లీ పౌర ఎన్నికల గెలుపు ఆప్‌కు కలిసివచ్చిందని భావిస్తున్నారు.

బీజేపీ దూకుడుగా వ్యవహరించినా..

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ని ఢీకొట్టేందుకు.. ఆప్‌ పలు వ్యూహాలను అనుసరించింది. ముఖ్యంగా కాషాయ పార్టీ ఆప్‌ అవినీతిపై ఆరోపణలను గుప్పించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ తన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందంటూ ఓట్లు కోరింది. ఇది నగరంలోని మూడు ల్యాండ్‌ఫిల్ సైట్‌లను ప్రధాన ఎన్నికల సమస్యగా మార్చింది. ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీ, ఢిల్లీ జల్ బోర్డు వివాదం, రవాణా కుంభకోణంపై ఆప్‌ను కార్నర్ చేసింది. కాలుష్యం, చెత్త సమస్య గురించి కూడా ప్రశ్నించింది. అయినప్పటికీ.. ఢిల్లీ వాసులు ఆప్‌ చీపురు వైపే నిలబడ్డారు. ఇంకా.. ఆప్‌ స్థానిక సమస్యలను ప్రస్తావించి ఓట్లను రాబట్టుకోగా.. బీజేపీ ప్రజా పంథాను చేజిక్కించుకోవడంలో కొంచెం వెనకబడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ వీడియోలు విడుదల చేసినా ప్రజలు ఆప్‌ కే జైకోట్టారు. ఇంకా, ఆప్‌ నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు లాంటివి కూడా ఆప్‌కు కలిసివచ్చాయనే పేర్కొంటున్నారు. ఏదీఏమైనా.. ఆప్‌ మాత్రం అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు సాగింది.

ప్రజలకు వివరించిన కేజ్రీవాల్..

ఎంసీడీని సొంతం చేసుకున్న ఆప్‌.. ఢిల్లీలో చెత్త, వాయు కాలుష్య సమస్యను ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు చూడాల్సి ఉంది. ఢిల్లీలో విద్యుత్, ప్రభుత్వ పథకాలు, పలు అంశాల గురించి ఆప్‌ ప్రజలకు వివరించడంలో సఫలీకృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎంసీడీ రెండింటిలోనూ అధికారంలో ఉంటే.. రాజధానిలోని నివాసితులకు పౌర సౌకర్యాలను అందించడానికి మరింత అవకాశం ఉంటుందని.. ప్రచారం చేసింది. నగరంలో రెండు అడ్మినిస్ట్రేషన్‌లకు ఒకే పార్టీ పాలన ఉంటే.. నిధులు, బడ్జెట్, ఆదేశాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయని కేజ్రీవాల్‌ ప్రజలకు వివరించారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో తరచూ ఫైట్..

కాగా, ఢిల్లీ నివాసితులకు కూడా, సంక్లిష్టమైన పరిపాలనా నిర్మాణంలో ఎవరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారనేది తరచుగా అస్పష్టంగా ఉంటుంది. ఢిల్లీకి భారతదేశంలో ప్రత్యేక హోదా, రాష్ట్ర లక్షణాలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అయినందున కొన్ని సేవలపై కేంద్రం కూడా ఆదేశాలను కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఓ వైపు స్థానిక పాలనా.. మరోవైపు కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలను కూడా పాటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎంసీడీ పీఠాన్ని అధిష్టించబోతున్న ఆప్‌ కు స్థానికంగా మద్దతు లభించే అవకాశం ఉన్నా.. మరో వైపు కేంద్రంతో మాత్రం సఖ్యతతోనే వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే.. గెలుపు అనంతరం.. ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశిస్సులు కావాలంటూ కోరారు.

వచ్చే ఎన్నికలపై ఫోకస్..

కాగా.. ఎన్నికల ఫలితాలు ఆప్‌ పార్టీకి మరింత ఉత్సాహాన్నిస్తాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు ఇది కలిసి వచ్చే విషయంగా పేర్కొంటున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో 2014, 2019లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను BJP కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇంకా.. రేపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల ఫలితాల కోసం కూడా ఆప్ ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో ఎక్కువశాతం ఓట్లు సాధిస్తే.. ఆప్ పార్టీ జాతీయ పార్టీగా మారుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..