Drishyam Movie Crime: దృశ్యం సినిమాను పది సార్లు చూసి తండ్రిని చంపేసింది.. పోలీసుల ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్

మీరు సినిమాలు చూస్తారా.. క్రైం స్టోరీతో మూవీకి ఏం సంబంధం అనుకుంటున్నారా.. మీరనుకున్నది కరెక్టే.. కానీ ఈ స్టోరీకి ఓ మూవీ కి లింక్ ఉంది. అది కూడా దృశ్యం సినిమాతో.. ఇప్పటికే సీన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. హా..

Drishyam Movie Crime: దృశ్యం సినిమాను పది సార్లు చూసి తండ్రిని చంపేసింది.. పోలీసుల ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్
Murder
Follow us

|

Updated on: Sep 30, 2022 | 12:32 PM

మీరు సినిమాలు చూస్తారా.. క్రైం స్టోరీతో మూవీకి ఏం సంబంధం అనుకుంటున్నారా.. మీరనుకున్నది కరెక్టే.. కానీ ఈ స్టోరీకి ఓ మూవీ కి లింక్ ఉంది. అది కూడా దృశ్యం సినిమాతో.. ఇప్పటికే సీన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. హా.. మీరనుకుంటున్నది కరెక్టే.. ఆ సినిమాలో హత్య చేసి, కుటుంబాన్ని పోలీసుల నుంచి తప్పించేందుకు కథానాయకుడు తన ఫ్యామిలీతో ఒకే రకమైన అబద్ధాన్ని చెప్పిస్తాడు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా వారు ఒకే మాట మీద ఉంటారు. అలా పోలీసులకు వివరాలు చెప్పకుండా హత్యా నేరం మోపకుండా సేఫ్ గా బయటపడతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. దృశ్యం సినిమాను ఏకంగా పది సార్లు చూసిన తల్లీ, కుమార్తెలు.. తన తండ్రిని దారుణంగా చంపేశారు. పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు దృశ్యం సినిమా స్టైల్ ను ఫాలో అయ్యారు. కానీ అది రీల్.. ఇది రియల్ అనే విషయాన్ని మర్చిపోయారు. పక్కాగా అందరూ ఒకే అబద్ధం చెప్పలేక చేతులెత్తేశారు. చివరకు పోలీసుల బేడీలకు చిక్కి కటకటాలపాలయ్యారు.

కర్నాటకలోని బెళగావికి చెందిన సుధీర్ కాంబళె దుబాయ్ లో ఉండేవాడు. అతని కుటుంబం స్థానికంగానే నివాసముండేది. అయితే కరోనా కారణంగా సుధీర్‌ స్వస్థలానికి తిరిగి వచ్చాడు. అక్కడే ఉంటూ భూవ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి భార్య రోహిణి, కుమార్తె స్నేహ ఉన్నారు. స్నేహ మహారాష్ట్రలోని పుణెలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. ఆ సమయంలో స్నేహకు అక్షయ్‌ విఠకర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి విషయం తెలుసుకున్న సుధీర్ కుమార్తెను మందలించాడు. తమ ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన స్నేహ.. ఎలాగైనా అతనిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని ఆమె తన తల్లికీ చెప్పింది. అయితే సుధీర్ హత్యకు ఆమె కూడా ఒప్పుకుని ప్రోత్సహించడం గమనార్హం.

సుధీర్ ను చంపేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అక్షయ్‌ విఠకర్‌ ను పుణె నుంచి బెళగావికి పిలిపించారు. ఈ క్రమంలో సుధీర్ ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్‌ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, ముఖంపై విచక్షణా రహితంగా పొడిచాడు. అతను మరణించారని నిర్ణయించుకున్నాక అక్షయ్‌ అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి పుణెకు వెళ్లిపోయాడు. తన భర్త సుధీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారంటూ రోహిణి పోలీసులకు కంప్లైంట్ చేసింది.

ఇవి కూడా చదవండి
Drishyam Murder

Drishyam Murder

ఆమె ఫిర్యాదుతో డీసీపీ రవీంద్ర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలా అడిగినా వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలిచ్చారు. అనుమానంతో తల్లీ కుమార్తెల ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన పోలీసులనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే