Shopping List: భర్తను కూరగాయల మార్కెట్ కు పంపుతున్నారా.. ఇలాంటి లిస్ట్ ను ప్రిపేర్ చేశారా మరి..

స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. కానీ కన్విన్స్ విషయానికి వస్తే ఆమె కంటే ఎవరూ బాగా వివరించలేరు. వారు ప్రతిదీ ఫుల్ క్లారిటీగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో బట్టలైనా, మేకప్ అయినా,...

Shopping List: భర్తను కూరగాయల మార్కెట్ కు పంపుతున్నారా.. ఇలాంటి లిస్ట్ ను ప్రిపేర్ చేశారా మరి..
Shoppping List
Follow us

|

Updated on: Nov 27, 2022 | 6:38 AM

స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. కానీ కన్విన్స్ విషయానికి వస్తే ఆమె కంటే ఎవరూ బాగా వివరించలేరు. వారు ప్రతిదీ ఫుల్ క్లారిటీగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో బట్టలైనా, మేకప్ అయినా, కూరగాయలైనా.. ఇలా ఏ విషయంలోనైనా పద్ధతి ప్రకారం నడుచుకోవాలని భావిస్తుంటారు. కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్రపంచంలో భార్యాభర్తలకు సంబంధించిన వీడియోలు, జోక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. స్టార్టింగ్ రోజుల్లో సోషల్ మీడియాను ఎలా యూజ్ చేయాలో అందరికీ తెలిసేది కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు సామాజిక మాధ్యమాల వినియోగంలోనూ విశేష మార్పులు వచ్చాయి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వీడియోలు, చిత్రాలు ఎలా తీయాలి. వాటిని ఎలా పోస్ట్ చేయాలి, వైరల్ గా ఎలా చేసుకోవాలి అనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం అలాంటి ఫోటో ఒకటి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు.

వైరల్ అవుతున్న చిత్రంలో.. ఓ మహిళ కూరగాయలు, సరకుల లిస్ట్ ను ప్రిపేర్ చేసి, భర్తకు ఇవ్వడాన్ని చూడవచ్చు. ఈ షాపింగ్ లిస్ట్‌లో.. ఎలాంటి కూరగాయలు ఎలా కొనాలి.. ఎలాంటి కూరగాయలు కొనకూడదు.. అనే వివరాలు ఉన్నాయి. లిస్ట్ తయారు చేసిన తర్వాత కూడా ఏదైనా తప్పుగా కొన్నట్లయితే.. ఆ లిస్ట్‌లో భార్య తన భర్తకు ఓ వార్నింగ్ ఇవ్వడాన్ని గమనించవచ్చు. అదేంటో ఆ భర్తకు మాత్రమే తెలియాలి.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వందల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్లు వస్తున్నాయి. కామెంట్లు చేస్తూ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ‘ మీ భర్తను కూరగాయలు కొనడానికి పంపినప్పుడు తప్పు జరగకూడదని భావిస్తే ఇలాంటి లిస్ట్ ను ఇవ్వండి’ అని, పాపం.. భార్య కోసం అతను పడే పాట్లు మగాళ్లందరికీ మెసేజ్ లా మారుతోందని ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..